Revanth Reddy : కేటీఆర్ సిల్లీ ట్వీట్… రేవంత్ అదిరిపోయే కౌంటర్..!
Latest News Telangana

Revanth Reddy : కేటీఆర్ సిల్లీ ట్వీట్… రేవంత్ అదిరిపోయే కౌంటర్..!

Revanth Reddy : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అన్న నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తూనే ఉంది… కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ పర్యటనను ఉద్దేశిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్వీట్ చేశారు.

“పొలిటికల్ టూరిస్ట్ లు వస్తారు.. పోతారు.. కానీ తెలంగాణలో ఉండేది కేసీఆర్ మాత్రమే” అని కేటీఆర్ ట్వీట్ చేయగా దీనిపైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy ) స్పందించారు.

“కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే ” అని కౌంటర్ ఇచ్చారు.

Also Read :