Raj Gopal Reddy : టీవీ9 డిబెట్‌‌‌లో అడ్డంగా బుక్కైన రాజగోపాల్ రెడ్డి..!
Latest News Telangana

Raj Gopal Reddy : టీవీ9 డిబెట్‌‌‌లో అడ్డంగా బుక్కైన రాజగోపాల్ రెడ్డి..!

Raj Gopal Reddy : నిజం నిప్పులాంటిది.. ఎప్పుడైనా… ఎట్లనైనా అది బయటపడ్తది. కోట్లు విలువ చేసే కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raj Gopal Reddy) బీజేపీలో చేరారన్న వార్తలు ముందునుంచి వస్తూనే ఉన్నాయి. అయితే వాటిని ఖండిస్తూ వచ్చిన ఆయన.. టీవీ9 డిబెట్‌‌‌లో మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. బీజేపీలో చేరుతానని తాను మూడు సంవత్సరాలు నుంచి చెప్తున్నానని, ఆరు నెలల క్రితం తనకి కొడుకు కంపెనీకి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఓకే అయినట్టుగా రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ కు గతకొంతకాలం నుంచి దూరంగా ఉంటూనే వచ్చారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అధిష్టానం పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చాక ఆ దూరాన్ని ఇంకొచెం పెంచి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. దానినే నిజం చేస్తూ ఆయన కాషాయం జెండా కప్పుకున్నారు. అయితే నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చాయి. 22 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని రెండు పార్టీలు ఆరోపించాయి. కాంట్రాక్టులు లేవు ఏమీ లేవంటూ రాజగోపాల్ రెడ్డి వాటిని ఖండిస్తూ వచ్చారు. ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోట ఇదే మాట చెబుతూ వచ్చారు. ఎక్కడ కూడా తన కొడుకు కంపెనీకి వచ్చిన కాంట్రాక్టుల గురించి ఆయన నోరు విప్పలేదు.

అయితే మునుగోడు బై పోల్ షెడ్యూల్ వచ్చాక టీవీ9 కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి ఆరు నెలల క్రితం తన కుమారుడి కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు చట్టబద్ధంగా వచ్చిందని బహిరంగంగా చెప్పారు. అయితే దీనికి తాను బీజేపీలో చేరడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలివిగా తనకు కాంట్రాక్టులు వచ్చాయని నిరూపిస్తే మాత్రం దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. నిరూపిస్తే మునుగోడు బరి నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

ఇన్నిరోజులు రూ. 18 కోట్ల కాంట్రాక్టుల విషయం ఎందుకు మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మునుగోడు జనం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టుగా ప్రచారం చేసి రాజగోపాల్ రెడ్డి ప్రజలను నిండా ముంచాడని ఆరోపిస్తున్నారు. ఇకనైనా మునుగోడు ప్రజలకు క్షమాపణ చెప్పి పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. లేకపోతే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అంటున్నారు.

Also Read :