Radisson Blu Hotel : ఆ పబ్ అండ్ రెస్టారెంట్‌‌కి షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…!
Latest News Telangana

Radisson Blu Hotel : ఆ పబ్ అండ్ రెస్టారెంట్‌‌కి షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…!

Radisson Blu Hotel: బంజారాహిల్స్‌లోని రాడిస‌న్ బ్లూ ప్లాజా హోట‌ల్‌(Radisson Blu Hotel)లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ అండ్ రెస్టారెంట్ కి తెలంగాణ ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది… ఆ హోటల్ లో డ్రగ్స్ పట్టుబడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది.

ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ యాజ‌మాన్యం ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన నేప‌థ్యంలో ప‌బ్, బార్ లైసెన్స్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్.. సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ సిటీ పోలీసుల టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసిన సంగతి తెలిసిందే.

నటుడు నాగబాబు కుమార్తె, నటుడు నిహారిక, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా 144 మంది పైన పోలీసులు కేసు బుక్ చేశారు.

Also Read :