KCR ATTITUDE : సారూ.. ఇగనన్న సోయికొస్తవా..?
Latest Telangana

KCR ATTITUDE : సారూ.. ఇగనన్న సోయికొస్తవా..?

PUBLIC SERIOUS OVER KCR ATTITUDE : దేశ చరిత్రలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ సంచలనం. ప్రచారం నుంచి.. డబ్బుల పంపిణీ దాకా అన్నింటిలో హుజురాబాద్ సంచలనంగా మారింది. అప్పటికే ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి.. అదే పార్టీకి ప్రత్యర్థి అయ్యాడు.

ఆ ప్రధాన ప్రత్యర్థిపై గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డారు కేసీఆర్. హుజురాబాద్ లో ఈటలకు మంచి పేరుంది. దీనికి తోడు టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టడం, కేసులు పెట్టడంతో ప్రజల్లో మరింత సింపతి పెరిగింది. వీటన్నింటిని ఎదుర్కునేందుకు తీవ్రంగా శ్రమించారు టీఆర్ఎస్ నేతలు.

రాష్ట్రంలో కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇదే టైంలో హుజురాబాద్ ఉప ఎన్నిక రావడంతో.. దెబ్బ కాస్త గట్టిగానే కొట్టారు ప్రజలు. తమ కసి మొత్తం ఓటుతో చూపించారు. కారును నుజ్జునుజ్జు చేశారు.

ఎందుకీ వ్యతిరేకత….

రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందనే ఆరోపణలున్నాయి. చాలా రాష్ట్రాల్లోనూ కుటుంబ పాలన జరుగుతోంది. దాన్ని పెద్దగా ప్రజలు వ్యతిరేకించడం లేదు. కానీ.. ప్రభుత్వ నిర్ణయాలే పెద్ద ఎదురుదెబ్బ అయ్యాయి. వంద మంది ఎమ్మెల్యేలున్నారు. నన్ను పీకేటోడే లేడని.. సీఎంకు ధీమా. మా బలగం గట్టిగా ఉంది మాకు అడ్డు చెప్పేవాడెవడంటూ పార్టీల అహంకార పూరితమైన మాటలు.

సమస్యపై ప్రశ్నిస్తే వెటకారపు సమాధానాలు, వంకర మాటలు.. ఇక కిందిస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. ఇష్టారాజ్యాంగా భూ కబ్జాలు, బెదిరింపులు.. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది.

ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ పట్టించుకోడు. కేటీఆర్ వాటిపై స్పందించడు. ఇదేంటని అడిగితే.. అది ఇప్పడు అవసరమా బ్రదర్ అంటారు కేటీఆర్.

ముఖ్యంగా యువతలో కేసీఆర్  పై నానాటికి వ్యతిరేకత పెరిగిపోతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వరు. ఇచ్చిన నోటిఫికేషన్లకు సక్రమంగా భర్తీ ప్రక్రియ జరగదు. ఇదుగో 50 వేల ఉద్యోగాలు.. అదుగో 50 వేల ఉద్యోగాలంటూ గప్పాలు కొడతారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో మాత్రం చెప్పరు.

పర్ ఫెక్ట్ గా చెప్పాలంటూ.. అరచేతిలో బెల్లం పెట్టి.. మోచేతిని నాకిస్తోంది టీఆర్ఎస్ సర్కారు.

గతంలో తానిచ్చిన హమీలపైనే ఇప్పుడు కేసీఆర్ మాట మార్చడం(KCR ATTITUDE) కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది.

పెన్షన్లు, రైతు బంధు, బీమా లాంటి పథకాలు బాగానే ఉన్నాయి. కానీ కేవలం కొన్ని పథకాలతో ప్రజలందరిని సాటిస్పై చేయడం సాధ్యమైన పనేనా..? ఈ చిన్న లాజిక్ ను సర్కారు ఎందుకు మరిచిపోతోందనేది అంతుపట్టని విషయం.

కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది.. అది తమకు పాజిటీవ్ గా మారుతుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కానీ.. రాష్ట్రంలో తమ పాలనపై ప్రజల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉందనే విషయాన్ని మరిచిపోతోంది. ఏకపక్ష నిర్ణయాలతో రోజు రోజుకి ప్రజలకు దూరమవుతూ.. కమీషన్ల సర్కారనే మాటను సార్దకం చేసుకుంటోంది.

మరి హుజురాబాద్ ఫలితాలు చూసిన తర్వాతైనా పాలకులు సోయికొస్తారో.. లేదో చూడాలి.

READ ALSO :