ప్రేమ,పెళ్లి .. గర్భవతిని చేసి మరో అమ్మాయి మేడలో మూడు ముళ్ళు..!
Latest News Telangana

ప్రేమ,పెళ్లి .. గర్భవతిని చేసి మరో అమ్మాయి మేడలో మూడు ముళ్ళు..!

ప్రేమ, పెళ్లి, మోసం తరుచుగా సమాజంలో చోటుచేసుకున్న ఘటనలు.. ఇది కూడా ఆలాంటి ఘటనే.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి టైం వచ్చేసరికి శ్రీజ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెల్లిచేసుకుంటానని నమ్మించిన ప్రశాంత్.. ప్రణీతని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు.

Prashanth Cheathed Pranitha Name of Love Medchal District Medipalli - Sakshi

అయితే ప్రణీతని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేశాడు. దీనిపైన తనకి న్యాయం కావాలని బాధితురల గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకి చెప్పకుండా మిర్యాలగూడ నుంచి చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చేశాడు.

బాధితురాలు ప్రశాంత్ ఇంటికి వెళ్లి అడగగా.. అతన్ని దాచిపెట్టి ఏం చేసుకుంటావో చేసుకో అని అతని తల్లిదండ్రులు చెప్తున్నారని వాపోయింది. దీనితో తనకి న్యాయం కావాలని కోరుతూ బాధితురాలు ప్రణీత.. ప్రశాంత్ ఇంటి ముందు నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read :