Political Game over Ias Venkatramireddy : సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సోమవారం ఉదయం వీఆర్ఎస్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మధ్యాహ్నాం తర్వాత టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ప్రకటించారు.
మంగళవారం రోజు ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఓ ఐఏఎస్ అధికారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఎమ్మెల్సీగా మండలికి పంపడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే.. ముందు నుంచి వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు చాలా సన్నిహితుడు. చాలా ఏళ్లుగా వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే చాలా కాలంగా ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనే పనిచేస్తున్నారు.
గతంలో సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా.. జిల్లాల విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా, ఆ తర్వాత సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. దీంతో ఆయనకు ఉమ్మడి మెదక్ జిల్లా మీద మంచి పట్టుంది.
కొద్ది రోజుల క్రితం సిద్దిపేట కొత్త కలెక్టరేట్ ఓపెనింగ్ టైంలో వెంకట్రామిరెడ్డి… సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం వివాదాస్పదమైంది. దానిని ఆయన సమర్థించుకున్నారు.
అంతకుముందు నుంచే వెంకట్రామిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో దుబ్బాక బైపోల్ టైంలోనే వెంకట్రామిరెడ్డికి టీఆర్ఎస్ బీఫారం ఇస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు.
ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో భాగంగానే వెంకట్రామిరెడ్డిని మండలికి పంపిస్తున్నారని సమాచారం. ఇప్పుడు మండలికి పంపించి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల టైంలో శాసనసభకు పంపేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారట.
గతంలో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగిన దుబ్బాక నుంచే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగుతారని టాక్. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ ను ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అందుకే వెంకట్రామిరెడ్డి సిద్ధం చేస్తున్నారట.
ఉమ్మడి జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి.. ఆయనకు అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజల గురించి అవగాహన ఉంది. దీంతో ఆయనను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని సీఎం భావించారట.
Read Also :
- Eyy Bidda Idhi Naa Adda : పుష్ప నుంచి మరో సర్ ప్రైజ్.. రచ్చే రచ్చ..!
- YS Jagan : గులాబ్ తుఫాన్ బాధిత రైతులకు పరిహారం
- Bandi Sanjay : ప్లీజ్.. నవ్వొద్దు. సీరియస్ పోస్ట్ ఇది..!
- Akhanda : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!
- Anchor Indu : అందాలు ఆరబోస్తున్న యాంకర్ ఇందు
- RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
- Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
- Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?
- Vijayashanthi : ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!
- AP Municipal : కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు … ‘అబ్బా వద్దురా ప్లీజ్’..!