PK IN TELANGANA : గులాబీ పార్టీకి గుబులుపుట్టిస్తున్న పీకే సర్వే…!
Latest News Telangana

PK IN TELANGANA : గులాబీ పార్టీకి గుబులుపుట్టిస్తున్న పీకే సర్వే…!

PK survey in telangana : ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పీకే టీమ్‌ సర్వే లీకులు సరికొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సర్వేలో పూర్తిగా అధికారపార్టీకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయని తేలడంతో ఇప్పుడు కారు పార్టీ నేతలంతా కంగారుపడుతున్నారు. తమపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా..అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాదాపు ఏడెనిమిది నియోజకర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ప్రజాఅభిప్రాయానికి విరుద్దంగా ఉందని సర్వేలో తేలింది. ఇదే టీమ్ తో ఎన్నికలకు వెళ్తే కారుకు బ్రేక్ లు పడటం ఖాయమనే మాట చెప్పడంతో ఇటు గులాబీ బాస్ తో పాటు అటు నియోజకవర్గాల్లోని నేతల్లోనూ టెన్షన్ మొదలైంది.

ఇదే ఈక్వేషన్ ఫాలోయితే పార్టీ టికెట్ దక్కుతుందో లేదో..అసలుకే మోసం వస్తుందోననే ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్  రెడ్డిపై పబ్లిక్ ఒపినియన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని తేల్చిందట పీకే(pk) సర్వే బృందం, మండలాలు, గ్రామాలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయలు సేకరించిన ప్రశాంత్ కిషోర్ బృంద సభ్యులు స్పష్టమైన నివేదికను పార్టీ అధినేతకు అందించింది, ఐకేరెడ్డిపై ప్రజావ్యతిరేకతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరగణం ఆరాచకాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వెళ్లాయి.

మంత్రిగా ఉన్న ఎనిమిదేళ్లనుంచి అసలు టీఆర్ఎస్ నేతలకు గానీ, అమరవీరుల కుటుంబాలకు గానీ ఎలాంటి సహకారం అందించలేదని, అంతా కుటుంబ సభ్యులకు బినామీల పేర్లతో భూములు, కాంట్రాక్టులు, కమీషన్లు కట్టబెట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, అంతేకాంకుడా గతంలో మంత్రి ఇచ్చిన రైల్వే లైన్ హామీ, పట్ణణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఇలా చెప్పిన హామీలేవి నెరవేర్చలేదనే పబ్లిక్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక ప్రభుత్వపథకాల అమలు, పార్టీ పరిస్థితి, ప్రజా వ్యతిరేకత, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు.. ఇలా నిర్మల్ నియోకవర్గంలో ప్రజాభిప్రాయాలు సేకరించిన పీకే టీమ్.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెగిటివ్ టాక్ ఉన్న లీడర్ల జాబితా, నివేదికను గులాబీ బాస్ కు అందించింది.

ఇక సర్వే రిపోర్ట్ తో పాటు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయించిన తొలి సర్వేలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది మంత్రుల జాబితాలో ఇంద్రకరణ్ రెడ్డి పేరు రెండో వరుసలోనే ఉండటంతో అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి పీకే సర్వేలో మంత్రి అవినీతి, ఆక్రమాలే ప్రధానంగా బయటకు రావడంతో అనుచరుల్లోనూ గుబులు కనిపిస్తోంది.

Read Also :