Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
Latest Telangana

Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?

Paddy farmer problems in Telangana : వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రమంతా ఆందోళన నడుస్తోంది. వానాకాలం వడ్లు కొంటలేరని కల్లాల దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. రోజులతరబడి కొనుగోళు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే వర్షంలో ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదే సమయంలో యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం కొనలేమని చెబుతోందని.. తాము వడ్లు కొనే పరిస్థితి లేదని కేసీఆర్ చెప్పారు. వరి వేస్తే రైతులు నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. సన్నాలు వేయాలని.. ఇతర పంటలు వేయాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

దీనికి తోడు.. ఎంతసేపు కేంద్రం మీద విమర్శలు చేయడం మీదే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఆయన బాటలోనే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.

paddy_telangana

అటు బీజేపీ మాత్రం కొనుగోళ్ల విషయంలో తమ తప్పేం లేదని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని అంటోంది. తాము కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఉడికించిన బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందని.. దానితో రైతుకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఉడికించిన బియ్యానికి ఎక్కువ ధర వస్తుంది కాబట్టి.. మిల్లర్లకు లాభం చేకూర్చేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలంటున్నారు.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇప్పుడు నిండా మునుగుతున్నది మాత్రం రైతులే. తప్పు వీళ్లదని వాళ్లు.. వాళ్లదని వీళ్లు రైతులను గందరగోళంలో పడేస్తున్నారు.

అసలు సమస్య ఎక్కడుంది..?

కానీ యాసంగి పంటల విషయంలో ఇప్పటికీ రైతులకు క్లారిటీ ఇవ్వలేదు. వరి వద్దన్నారు. మరి ఏ పంట వేయాలనేది చెప్పట్లేదు.

అయితే.. రైతులు నేల స్వభావాన్ని బట్టి.. ఏ పంటనైనా పండించగలరు. కానీ దానికి కావాల్సిన మౌలిక వసతులు సర్కారు కల్పించాలి. విత్తనాలు సరఫరా చేయాలి. అవసరమైన యంత్రాలు సమకూర్చాలి. కానీ ఇవేవీ సర్కారు చేయడం లేదు. ఎంతసేపూ రైతు బంధు ఇస్తున్నాం కదా.. రైతులకు అంతకుమించి ఏం కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

Image

గతంలో ఇతర పంటలు వేసిన రైతులు.. నీటి లభ్యత పెరగడంతో పూర్తిగా వరిసాగు వైపు మళ్లారు. దొడ్డు రకాలకు ధర ఎక్కువ రావడం, పని తక్కువ ఉండటం కూడా ఓ కారణం. ఇతర పంటలు వేస్తే.. శారీరంగా, ఆర్థికంగా కూడా రైతులకు భారమే.

ఇలాంటి పరిస్థితిలో రైతులు తిరిగి ఇతర పంటల వైపు మళ్లేలా సర్కారు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. రైతుకు బాసటగా ఉండే ప్రయత్నం చేయాలి.

దీనికి తోడు రైతులకు కోతులు, అడవిపందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వీటి నుంచి ఎలా ఉపశమనం కల్పిస్తారో సర్కారు చెప్పడం లేదు.

ఇవేవీ చేయకుండా.. పంట మార్పిడి చేయండి. వరి వేయకండి. ఇతర పంటలు వేయండని సర్కారు చెబుతోంది. సమస్యను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

Read Also :