Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!
Latest Telangana

Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!

Omicron local spreading in Hyderabad : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కరోనా వచ్చింది. తగ్గిపోయింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాం.. మాకేం అవుతుందనే నెగ్లెజెన్సీలో ఉన్నవాళ్లు ఇకపై కాస్త కంట్రోల్ అవ్వాల్సిందే. ఇకపై ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచింది.

ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్(Omicron) వ్యాప్తి మరింత వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే ఒమిక్రాన్(Omicron) సోకినట్టు బయటపడింది.

కానీ మంగళవారం వచ్చిన బులిటెన్ ప్రకారం సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఓ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కు ఒమిక్రాన్ సోకినట్టు గుర్తించారు.

ఇవి కూడా చదవండి :

ప్రస్తుతం ఆ డాక్టర్ (doctor) ఫిల్మ్ నగర్ సమీపంలోకి ఆ కార్పొరేట్ హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అంతేకాదు. డాక్టర్ భార్యకు కూడా కరోనాపాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఆమె శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు.

సోమాలియా హాట్ స్పాట్

ఇక.. సోమాలియా(Somalia) వ్యక్తిని కాంటాక్ట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేశారు డాక్టర్. ఇప్పుడు వారందరిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు డాక్టర్లు. అంతేకాదు.. హాస్పిటల్ స్టాఫ్(hospital staff) లోనూ చాలామందితోనూ ఆయన కాంటాక్ట్ అయినట్టు గుర్తించారు.

మరోవైపు.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి షెల్టర్ తీసుకున్న టోలీచౌకీ(tolichouki)లోని పారామౌంట్ కాలనీలో 1100 మందికి కరోనా టెస్టులు చేశారు. వీరిలో చాలామందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆరోగ్యశాఖ(health ministry telangana) అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు.

పారామౌంట్ కాలనీ, కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా కొత్త వేరియంట్ ఎంత మందికి వ్యాపించిందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి కాంటాక్ట్ ట్రేసింగ్(contact tracing) లోనే అధికారులు బిజీగా ఉన్నారు. కాంటాక్ట్ పర్సన్స్ లెక్క తేలితే కానీ.. ఎంతమందికి ఒమిక్రాన్ సోకిందనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

కాబట్టి ప్రజలు అలర్ట్ గా ఉండాలి. గుంపులు గుంపులుగా ఉండకపోవడం, జనసమూహం ఉన్నచోటికి వెళ్లకపోవడం బెటర్. న్యూఇయర్(new year parties) పార్టీలు అవాయిడ్ చేయడం శ్రేయష్కరం. బయటకు వెళ్లినప్పుడు కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం మాత్రం మస్ట్.

ఒమిక్రాన్ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లోనేరెట్టింపు అవుతున్నాయి. అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తీరా వైరస్ అంటుకున్నాక తిప్పలు పడే కంటే.. ఇప్పుడే అలర్ట్ అవ్వడం బెటర్.

ఇవి కూడా చదవండి :