BJP : అమిత్ షాకు హ్యాండ్ ఇచ్చిన బాద్‍షా..!
Latest News Telangana

BJP : అమిత్ షాకు హ్యాండ్ ఇచ్చిన బాద్‍షా..!

  • అమిత్ షాకు హ్యాండ్ ఇచ్చిన బాద్షా..!
  • నితిన్ సై.. ఎన్టీఆర్ నై..!

BJP  : తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ(BJP ) విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. పేరున్న లీడర్ల నుంచి యాక్టర్ లను కలుస్తుంది.. ఓకే అనుకుంటే తమలో కలిపేసుకుంటుంది. మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా.. ఇవాళ నితిన్, మిథాలీతో నడ్డా సమావేశం అయ్యారు.

Image

వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేయాలని భేటీలో వారిని కొరారు. అయితే నితిన్, మిథాలీతో జరిపిన చర్చలు సక్సెస్ కాగా, ఎన్టీఆర్ మాత్రం వారికి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మోడీ పాలన పట్ల నితిన్, మిథాలీ ముగ్ధులయ్యారని, అవసరం అనుకుంటే ప్రధాని కోసం తమ సేవలు వినియోగిస్తామని వాళ్లు హామీ ఇచ్చిన్నట్లుగా ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.

Image

అయితే ఎన్టీఆర్ తో మీటింగ్ పై ఇంతవరకు ఎవరూ ఎలాంటి ఆప్డేట్ ఇవ్వలేదు. దీంతో అమిత్ షా, బాద్షా మీటింగ్ ఫెయిల్ అయినట్టుగా పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.

Image

Also Read :