TRS : తెలంగాణలో కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’.. ఎవరీ తుపాకుల బాలరంగం?
Latest News Telangana

TRS : తెలంగాణలో కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’.. ఎవరీ తుపాకుల బాలరంగం?

TRS : టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS) (తెలంగాణ రాజ్యసమితి ) పార్టీ పేరుతో మరో పార్టీ రిజిస్టర్ అయింది. దీనిని ఎలక్షన్ కమిషన్ కూడా ఆమోదించింది. ఈ దరఖాస్తు సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అనే వ్యక్తి నుండి వెళ్లింది.

పార్టీ ఆఫీస్ అడ్రస్ ను ఓల్డ్ అల్వాల్ ఇంటి నెంబర్ 1-4-177/ 148/ 149గా దరఖాస్తులో బాలరంగం పేర్కొన్నారు. ఈ పార్టీకి ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్ధిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్ ఉన్నారు. కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సత్తుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్లుగా దరఖాస్తులో తెలిపాడు. ఈ కొత్త పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలంటూ 30 రోజుల గడువు కూడా ఇచ్చారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ అనే పేరుకు ఇంకా జ‌నాలు అల‌వాట‌ప‌డ‌లేదు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటం, ఇలాంటి టైమ్ లో టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చేలా ఓ కొత్త పార్టీ రిజిస్టర్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పార్టీని తుపాకుల బాలరంగం స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకున్నాడా లేదంటే ఆయ‌న వెన‌క ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్ ఆయనకదలికల పైన ఫోకస్ పెట్టారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక పొంగులేటి టీఆర్ఎస్ పేరుతో ఓ పార్టీ పెడుతున్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం కూడా నడిచింది. అయితే దీనిని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బాలరంగం అనే వ్యక్తితో పెట్టించినట్లుగా తెలుస్తోంది. బాలరంగం కూడా కేసీఆర్ కు చాలా దగ్గరి వ్యక్తి కూడా.

తుపాకుల బాలరంగం స్వస్థలం సిద్ధిపేట. ఆయన 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్‌ఎస్‌ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019-2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యునిగా పని చేశారు.

Also Read :