KANGANA RANAUT : కంగనాపై హైదరాబాద్ లో కేసు.. ఎందుకంటే..
Latest Telangana

KANGANA RANAUT : కంగనాపై హైదరాబాద్ లో కేసు.. ఎందుకంటే..

NAMPALLY COURT ORDERED TO PROBE ON KANGANA RANAUT :  స్వాతంత్ర్య పోరాటంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే కంగనాపై ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ లోనూ కంగనాపై(KANGANA RANAUT ) కేసు నమోదయ్యింది. స్వాతంత్ర్య పోరాటంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కొమిరెడ్డి అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

స్వాతంత్ర్య పోరాటాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాన్ని అవమానపరిచేలా కంగనా(KANGANA RANAUT ) వ్యాఖ్యానించిందని న్యాయవాది కొమిరెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది.

READ ALSO :