Mynampally : ‘బండి సంజయ్..నీ గుండు పగులుద్ది ‘.. మైనంపల్లి బూతుపురాణం..! 
Latest News Telangana

Mynampally : ‘బండి సంజయ్..నీ గుండు పగులుద్ది ‘.. మైనంపల్లి బూతుపురాణం..! 

Mynampally hanumantha Rao sensational comments on MP bandi sanjay: స్వాతంత్ర దినోత్సవం రోజున మల్కాజిగిరిలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ పై టీఆర్ఎస్ నేతలు బీర్లతో దాడికి దిగారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన శ్రావణ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి కబ్జాలన్నీ త్వరలో బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పై ఏ మాత్రం తగ్గకుండా మైనంపల్లి(Mynampally hanumantha Rao) కూడా అంతే స్థాయిలో స్పందించారు. బండి సంజయ్ ఒక బచ్చాగాడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మైనంపల్లి. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్ కి ఎక్కువ ఎంపీ స్థాయికి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని.. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి బండి భరతం పడతానని, త్వరలోనే బండి సంజయ్ రాసలీలలు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు మైనంపల్లి.

మైనంపల్లి హన్మంతరావు కామెంట్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బండి సంజయ్ చుట్టూ వున్నదంతా భూకబ్జాదారులేనని అన్నారు మైనంపల్లి.  బీజేపీ నేతలు ఓ పోలీస్ అధికారిపై దాడి చేశారని, తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని మైనంపల్లి ఆరోపించారు. బండి సంజయ్ కి దమ్ముంటే నా ఎదురుగా వచ్చి ఆరోపణలు చేయాలని అన్నారు.

Read Also: