KCR…. మంచోడే… కానీ…!
Latest News Telangana

KCR…. మంచోడే… కానీ…!

KCR : కేసీఆర్ మొదలు పెట్టే గేమ్… కేసీఆర్ గెలిచే గేమ్.
Example… Telangana State formation.
(ఇంత కన్నా… ఏం చెప్పనీకి పెద్ద ముచ్చటేం లేదు)
ఎదుటోళ్లు… రియాక్టయినా… రెస్పాండయినా… అనుకూలించినా… వ్యతిరేకించినా… తనకే ప్లస్ అయ్యేలా…. గేమ్ మొదలు వెడ్తడు.
రిజల్ట్ వచ్చే దాంక తెల్వది…. కేసీఆర్ గేమ్ ప్లాన్.
చెన్నారెడ్డి కంటే…. కేసీఆర్ ఏమీ తోపు కాదు…
కానీ… చెన్నారెడ్డి చేయలేంది…. కేసీఆర్ చేసిండు. తెలంగాణ తెచ్చిండు.
దిల్ దార్ ఎమ్మెస్సార్ కంటే… కేసీఆర్ గ్రేట్ కాదు. కానీ… ఎమ్మెస్సార్ తగ్గినట్టు… కేసీఆర్ తగ్గలేదు.
పీజేఆర్… కంటే కేసీఆర్ గ్రేట్ కాదు… కానీ..
బస్తీ జనాల కోసం… హైదరాబాద్ లో… బస్తీ దవాఖానలతోని… పీజేఆర్ ఆశయాల్ని కొనసాగిస్తున్నడు.
మాదిగ… అనే కులం పేరును… పేరు పక్కన పెట్టుకోవచ్చని… ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన.. మంద కృష్ణ మాదిగ కంటే… కేసీఆర్ గ్రేట్ కాదు… కానీ… దళిత బంధు మంచి స్కీమ్…. అమలు చేస్తున్నడు.
ఆర్.కృష్ణయ్య…. బీసీ సామాజిక ఉద్యమం చేసినప్పుడు… కేసీఆర్… చిన్న నాయకుడే కావొచ్చు. ఆర్.కృష్ణయ్య కంటే.. కేసీఆర్ గ్రేట్ కాదు. కానీ.. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు.. ఇప్పుడెట్లున్నయి.. ?
ఎప్పడొచ్చామన్నది …. Not important.
( నా ఫేవరెట్ లీడర్స్… మర్రి చెన్నారెడ్డి, ఎమ్మెస్సార్, పీజేఆర్, మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య. వాళ్ల.. గమ్యం నచ్చుతనే కదా.. ఇష్టపడేది. మరి… వాళ్లు అనుకున్న గమ్యాన్ని పూర్తిగా చేరుకోలేదు. వాళ్లు చేయలేంది చేస్తున్న వాడిని ఇష్ట పడకుండా ఎలా ఉంటాం..!)

May be an image of 1 person and indoor
(మరి… ఈ పోస్టుకు…. షేర్ చేసిన ఫోటోకు ఏమైనా… సంబంధముందా…? అంటే… ఏం చెప్పలేం. కేసీఆర్ ప్లాన్ చేసే గేమ్… కేసీఆర్ కు తప్ప… ఎవరికీ తెలియదు…. ఎంపీ సంతోష్ కుమార్ కు కూడా….!)
ఇంతకీ… నేను చెప్పదల్చుకున్నదేంటంటే…
కేసీఆర్…. “మంచోడే… కానీ…!”

Also Read :

Credit

Engurthi sathyam