MLA Rajaiah : మాజీ ఉపముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు.. తాజాగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఓ మహిళా కార్యకర్తతో ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.
కేక్ కట్ చేసి మహిళకు తినిపిస్తూ మహిళ బుగ్గ గిల్లుతూ ఆమె నోట్లో వేలుపెడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. రాజయ్య రాసలీలలు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
వాస్తవానికి ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ అందరికి భర్త అంటూ చేసిన వాఖ్యలు వివాదస్పమైన నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది.
దీనితో నెటిజన్లు ఎమ్మెల్యే రాజయ్యను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. కాగా గతంలో ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
Also Read :
- Divorce Settlement : విడాకులు తీసుకుంటే భరణం ఎందుకివ్వాలి.? ఎంతివ్వాలి..?
- Confusion On BJP Candidate : ఇదేందయ్యా ఇది.. మళ్లీ ఇదేం కన్ఫ్యూజన్..!
- Akkineni Nagarjuna: .. అసలు నువ్వు సూపర్… నీ కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్..!