KTR Speech : తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు కేటీఆర్ ప్రసంగం(KTR Speech) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉద్యమాల తెలంగాణ నుంచి ఆత్మగౌరవ పరిపాలన దాకా సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని, పథకాలను, వాటికి దక్కిన ప్రశంసలను, కలిగిన ప్రయోజనాలను జనసామ్యం భాషలో ఆయన వివరించిన తీరు తెలంగాణను ప్రేమించే వారందరికీ గర్వం కలిగిస్తుంది.
రెండు గంటల పాటు సాగిన ఆయన ప్రసంగం తీరు, అందులో అయన ఎత్తుకున్న అంశాలు, వాటిని సమాచార సహితంగా, సత్యాల ఆధారంగా సాగిన ప్రసంగం అద్భుతం. తెలంగాణ రాష్ట్రము గత ఎనిమిది సంవత్సరాలలో సాధించిన విజయాలు అనేకం, అపూర్వం. కానీ వాటిని ప్రజా బహుల్యం లోకి తీసుకువెళ్లేందుకు ఈరోజు కేటీఆర్ ప్రసంగం ఒక గొప్ప దిక్సూచిగా, ఒక కరదీపికగా మారుతుంది అంటే అతిశయోక్తి కాదు.
సొంత రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రజలు దుఃఖంతో పాడుకున్న పాటలు, ఇక్కడి మహనీయులు రాసిన సాహిత్యంలోని మాటలను ప్రస్తావిస్తూ… ఒకప్పటి తెలంగాణ దుర్భరమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ… సకల సౌభాగ్యాల తెలంగాణ దిశగా తెలంగాణను నడిపిస్తున్న తీరును గొప్పగా, కళ్లకుకట్టేలా చెప్పారు. ఉన్నత విద్యావంతుడిగా, తర్వాతి తరం రాజకీయ నాయకుడిగా తనకున్న సాఫ్ట్ ఇమేజ్, ఈ ప్రసంగం తర్వాత ఒక స్టేట్స్ మెన్ ఇమేజ్ గా మారుతుంది.
తమ ప్రభుత్వ విజయాలను ఒకవైపు అలవోకగా గణాంకాలతో సహా వల్లే వేస్తూనే… రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండాడిన తీరు ఈ రాష్ట్రానికి అపూర్వమైన రాజకీయ వేత్తను మరోసారి పరిచయం అయినట్లు అనిపించింది. గంటలకు కొద్ది మాట్లాడినా వినాలనిపించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారిని ఈరోజు కేటీఆర్ మరిపించారంటే అతిశయం, అతిశయోక్తి ఏమాత్రం లేదని బలంగా చెప్పవచ్చు.
దేశమంతా ఒక రకమైన నిరాశాపూరిత వాతావరణం నిండుకున్న ఈ తరుణంలో, కొత్త దేవుడిగా కొంతమంది కొలుస్తున్న బలమైన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ వైఫల్యాలను ఒక్క అక్షరం తొట్రుపాటు లేకుండా… ఏలాంటి జంకు లేకుండా… కుండబద్దలు కొట్టినట్లు, అరటిపండు వలిచి చెప్పినట్లు కేటీఆర్ వివరించిన తీరు ఇప్పుడు అత్యవసరం.
Credit : Dr. Manikya Mahesh
Also Read :