KTR : జై శ్రీరామ్, జై మోడీ అని ఈటల ఎందుకు అనడం లేదు : కేటీఆర్‌
Latest News Telangana

KTR : జై శ్రీరామ్, జై మోడీ అని ఈటల ఎందుకు అనడం లేదు : కేటీఆర్‌

KTR chit chat with media : రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మీడియాతో ముచ్చటించారు. హుజురాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ వెయ్యి శాతం కుమ్మక్కయ్యాయని చెప్పారు. ఈటల రాజేందర్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. అందుకే హుజురాబాద్ లో డమ్మీ అభ్యర్థిని పెట్టిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ కాకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.

ఈటలను బీజేపీ, బీజేపీని ఈటల ఓన్ చేసుకోవడం లేదన్నారు కేటీఆర్(ktr). ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అయితే జై శ్రీరామ్, జై మోడీ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అనే బురదలోకి దిగి తనకు అంటొద్దని ఈటల అనుకుంటే ఎలా అన్నారు కేటీఆర్.

టీఆర్ఎస్ లో ఈటలకు ఏం అన్యాయం జరిగిందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదన్నారు. ఈటల గెలిస్తే ప్రజలకు వచ్చేదేంటో చెప్పాలన్నారు.
దళితబంధు 10 రోజులు మాత్రమే ఆగుతుందని.. దీనిపై లేనిపోని అపోహలు వద్దని చెప్పారు కేటీఆర్.

టీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు.

హుజురాబాద్ ఉపఎన్నికలయ్యాక ఏడాది లోపు ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతాడన్నారు కేటీఆర్. మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్ లోకే వెళ్తాడన్నారు.

Read Also :