మీ బతుకుల మన్ను.. గాంధీ ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధులు..!
Latest News Telangana

మీ బతుకుల మన్ను.. గాంధీ ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధులు..!

గాంధీ ఆసుపత్రిలో కామాంధులు రెచ్చిపోయారు. చికిత్స కోసం రోగికి సహయకులుగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. రోగితో పాటుగా ఆయన భార్య, మరదలు కూడా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలో పనిచేసే ఉమామహేశ్వరరావు దూరపు బంధువు కావడంతో అతనితో మాట్లాడేవారు.

ఈ క్రమంలో ఈనెల 8న రోగి భార్య, మరదలుని ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం ఇద్దరు ఆపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఉమామహేశ్వరరావుతో పాటుగా మరికొందరు వారి పైన అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

అంతేకాకుండా మరోసారి వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే వీరి చేర నుంచి తప్పించుకున్న రోగి మరదలు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు మొదలు పెట్టారు.

Also Read :