ఉప్పరపల్లి బంగార్రాజుకు మహానంది జాతీయ పురస్కారం
Latest News Telangana

ఉప్పరపల్లి బంగార్రాజుకు మహానంది జాతీయ పురస్కారం

తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ లో మహానంది జాతీయ పురస్కారాల కార్యక్రమం చాలా వేడుక గా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞ కనబర్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు మహానంది పురస్కారం అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విశాఖపట్నానికి చెందిన ఉప్పరపల్లి బంగార్రాజు కూడా ఉన్నారు.

చిరకాలం గా చిత్రకళ లో విశేష ప్రతిభను కనబర్చినందుకు ఈయన అవార్డు అందుకున్నారు. వీరి ఇద్దరి కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇదే రంగంలో కృషి చేయడం విశేషం. వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పోలోజు రాజకుమార్ గారు మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కల్గిన వ్యక్తులను ఈ విధంగా సన్మానించి గౌరవించే అవకాశం కలగడం తెలుగు వెలుగు సాహితీ వేదిక అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమం లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అవార్డు గ్రహీతలను అభినందించారు.