MAHA organic awards : రైతులను ముంచుతున్న ఫర్టిలైజర్ మాఫియా
Latest Telangana

MAHA organic awards : రైతులను ముంచుతున్న ఫర్టిలైజర్ మాఫియా

MAHA organic awards : అంతర్జాతీయ ఫర్టిలైజర్స్‌ మాఫియాతో యుద్ధం చేయాలంటే ఉక్కు నరాలు ఇనుప కండరాలు కావాలని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ హోటల్‌ దస్పల్లాలో జరిగి మహా ఆర్గానిక్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ఫర్టిలైజర్ మాఫియా కారణంగా రైతులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తలెత్తిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఫెర్టిలైజర్ మాఫియాపై చర్య తీసుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తగిన మోతాదులో రసాయనాలను వినియోగించి నాణ్యమైన పంటలను పండించాలని రైతులకు సూచించారు.

Read Also :

రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధి సూచించారు. మహాన్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ… రైతులు ఆహారం పండించి దేశ ప్రజలకు అందిస్తున్నారని.. వారికి తమవంతు సహకారం అందించేందుకే మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డ్స్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇకపై ప్రతి ఏటా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

maha organic awards

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులతోపాటు, ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్జీఓలకు సైతం మహాన్యూస్‌ తరఫున మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు మంచి లాభాలను గడిస్తున్నారని రైతు నేస్తం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. మహాన్యూస్‌ ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న తమను గుర్తించి.. సన్మానించడం ఆనందంగా ఉందని అవార్డు గ్రహీతలు చెప్పారు.

Read Also :