KTR : కరెన్సీ నోట్ల పై మోడీ ఫోటో వేస్తారేమో?
Latest News Telangana

KTR : కరెన్సీ నోట్ల పై మోడీ ఫోటో వేస్తారేమో?

KTR : ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అహ్మదాబాద్‌లోని LG మెడికల్ కాలేజి పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. ఇక కరెన్సీ నోట్ల పై కూడా గాంధీ ఫోటో తీసేసి మోడీ ఫోటోను ముద్రించండని ఆర్‌బిఐకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలో ఆదేశాలు ఇస్తారేమా అంటూ కేటీఆర్ (KTR ) ట్వీట్ చేశారు.

అంతకుముందు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని చేసిన కామెంట్స్ పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ముందుగా “అహ్మదాబాద్ పేరును ముందుగా అదానీబాద్‌గా ఎందుకు మార్చకూడదు?” అని ప్రశ్నించారు.

Also Read :