KTR Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ ఇగనన్న మంచిగైతదా.?
Latest Telangana

KTR Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ ఇగనన్న మంచిగైతదా.?

KTR Visited Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీని తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్థులు ధర్నా చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులు సత్యాగ్రహం చేశారు.  ఆ తర్వాత రెండు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ కావడంతో బాసర ట్రిపుల్ ఐటీ భవిష్యత్ ఏంటనేది అంధకారంగా మారింది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి విజిట్ చేసి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఈ సారి ఏకంగా మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. బాసర టూర్ లో ఉన్న ఆయన సబితా ఇంద్రారెడ్డితో కలిసి ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. వారితో ఫోటోలు దిగారు. కేటీఆర్ కు స్టూడెంట్స్ కూడా గ్రాండ్ గా వెల్కం చెప్పారు.

Read Also :

విద్యార్థులను చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ (KTR Basara ) హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మినీ టీహబ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో త్వరలోనే వెయ్యి కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ లోగా విద్యార్థులకు లాప్ టాప్ లు అందజేస్తామన్నారు.

అలాగే.. కొత్తగా మరో 50 క్లాస్ రూముల కోసం భవనాలు నిర్మిస్తామన్నారు. ఆడిటోరియం అభివృద్ధితో పాటు.. స్టేడియం కోసం మూడు కోట్ల నిధులిస్తామనికేటీఆర్ (KTR Basara )ప్రకటించారు.