khairatabad Ganesh : ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతి(khairatabad Ganesh) నిమజ్జనం ముగిసింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం… భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8గంటల 18 నిమిషాలకు ప్రారంభమైన గణనాథుని శోభయాత్ర…. భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.
Also Read :
- Telangana : ‘ఒక నాగలి, రెండు ఎడ్లు’.. ఏమైందయ్యా రఘునందనా..!
- Anasuya Bharadwaj : పసుపు పచ్చ సారీలో పిచ్చెక్కిస్తున్న రంగమ్మత్త..!