KGF : KGF ప్రాణాలు తీస్తోంది..? పోలీసులే పరేషాన్..!
Latest Telangana

KGF : KGF ప్రాణాలు తీస్తోంది..? పోలీసులే పరేషాన్..!

KGF movie type murders in Telangana : భారతీయ సినీ చరిత్రలో కేజీఎఫ్ ది ప్రత్యేక స్థానం. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ నుంచి.. సీక్వెల్ వరకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోయాలా ఉంది. సినిమా స్టోరీ, టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… మూవీ లవర్స్ ని కట్టేపడేశాయి.

అంతేకాదు.. సనిమాలో వాడిని వెపన్స్ కూడా అంతే యూనిక్ గా ఉన్నాయి. కేజీఎఫ్ 1 నుంచి కేజీఎఫ్ 2 వరకు అన్నీ డిఫరెంట్ ఆయుధాలు వాడారు. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా మారణాయుధాలుగా మారతాయని చూపించారు.

అయితే.. ఏదైనా సినిమా వచ్చినప్పుడు పబ్లిక్ దాని ట్రెండ్ ఫాలో అవడం కామన్. హీరోని ఇమిటేడ్ చేయడం, అందులో వాడిన వస్తువులు, దుస్తులు ఇలా మార్కెట్ లో హల్చల్ చేస్తాయి. అయితే కేజీఎఫ్ తర్వాత ఓ ప్రమాదకరమైన ట్రెండ్ నడుస్తోంది.

కేజీఎఫ్ లో శత్రువులను సుత్తితో కొట్టి చంపేస్తాడు హీరో. ఇప్పుడు అదె ట్రెండ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. మామూలుగా అయితే కత్తులతో, తుపాకులతో మర్డర్లు జరిగేవి. ఇప్పుడు కొత్తగా సుత్తితో హత్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు కీలకమైన కేసుల్లో హత్యలకు సుత్తినే వాడారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో ఆ మధ్య జ్యోతి అనే యువతిని ఆమె ప్రియుడు యశ్వంత్ ను భర్త హత్య చేశాడు. ఈ హత్యలో అతడు వాడిన ఆయుధం సుత్తి. మొదట భార్య ప్రియుడి తలపై సుత్తితో కొట్టి చంపాడు. తర్వాత భార్యతను అదే సుత్తితో చంపాడు.

swetha reddyyashmin

రీసెంట్ గా బయటకు వచ్చిన శ్వేతారెడ్డి ఇష్యూలోనూ అదే జరిగింది. మీర్ పేట్ ప్రశాంత్ హిల్స్ లో శ్వేతారెడ్డి అనే వివాహిత తన ప్రియుడిని.. మరో ప్రియుడితో చంపించింది. ఈ హత్యలోనూ నిందితుడు సుత్తినే వాడాడు. బైక్ పై వెళ్తున్న యశ్మిన్ ను సుత్తితో తలపై కొట్టడంతో అతను చనిపోయాడు.

ఇలా వరుస హత్యల్లో కేజీఎఫ్ ట్రెండ్ కొనసాగడం పోలీసులను టెన్షన్ పెడుతోంది.