KCR Delhi : తెలంగాణా సీఎం కేసీఆర్ (KCR Delhi) ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. ధాన్యం సేకరణ, నీటి వాటాల పంపకం, విద్యుత్ చట్టం రద్దు పలు అంశాల పైన కేసీఆర్ చర్చించనున్నారు.
అవసరమైతే ప్రధాని మోదీని కూడా కేసీఆర్ కలవనున్నారు. ఇదిలావుండగా ఆయన భార్య శోభ, మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా బారిన పడిన తర్వాత కేసీఆర్ భార్య శోభ ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమెకి చెకప్‌లు చేయనున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. రెండు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.
Also Read :
- Karthikeya Marriage : ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి… స్పెషల్ అట్రాక్షన్‌గా ఇందు..!
- KCR_ Jagan : చాలా రోజుల తర్వాత కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు..!
- Rekha Boj : ‘రారా సామీ’ కవర్ సాంగ్.. అబ్బ దుబ్బరేపినవ్ పో..!