KCR : రాజకీయాల్లో అపరచాణక్యుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి (KCR)మంచి పేరుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకీ బాగా తెలుసు.. కేసీఆర్ స్కెచ్ వేస్తె తిరుగుండదని అంటుంటారు నేతలు.. ఇప్పుడు ఆలాంటి కేసీఆర్‌కి మరో ఆలోచన తట్టింది.. అదే దళితుడిని సీఎం చేయాలనీ… అవును మీరు చదివింది కరెక్టే..!
తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సీఏం అయ్యాక ఫస్ట్ టర్మ్‌లో పాలన పర్వాలేదని అనిపించారు.. కానీ సెకండ్ టర్మ్‌లో అందుకు భిన్నంగా పాలన ఉంది. దీనితో కేసీఆర్ పై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఇచ్చిన హామీలను నమ్మేలా ప్రజలు కూడా లేరు. ఈ క్రమంలో హుజురాబాద్ బై ఎలక్షన్ ముందు దళితబంధు అనే ఓ స్కీం తీసుకొచ్చారు కేసీఆర్.
ఇంటికి పదిలక్షలు అన్న నమ్మేందుకు సిద్దంగా లేరు.. నిజంగా ఇస్తారా? అందరికీ వస్తాయా? ఎలక్షన్ల వరకేనా ఈ మాటలు.. ఇలా అనేక అనుమానాలున్నాయి. ఎందుకంటే గతంలో దళితులకి ఇచ్చిన హామీల విషయంలో కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇందుకు కారణం. అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి అంటూ చెప్పిన మాటలు వట్టివే అయ్యాయి.
ప్రతిపక్షాలు ఇప్పటికి కేసీఆర్‌ని ఈ రెండు హామీలపై ఏకీ పారేస్తున్నాయి. ఈ మచ్చ కేసీఆర్‌కి ఎప్పటికి ఉంటుంది. అది పోగొట్టుకునేందుకు భారీ స్కెచ్ వేశారు కేసీఆర్. అదే దళితుడిని సీఎం చేయడం.. ఇప్పుడు దీనిపైన ప్రగతి భవన్ లో హాట్ డిస్కషన్ నడుస్తుంది. ఈ రెండున్నరెళ్ళు దళితుడిని సీఎం చేస్తే.. తనపై ఉన్న మచ్చ చెరిగిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారట..అప్పుడు కడిగిన ముత్యంలా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళొచ్చని కేసీఆర్ ప్లాన్‌లో ఉన్నారట.
అయితే పదవి పోతే సారు ఎలా ఉంటారన్నది అసలు పాయింట్.. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా.. కేసీఆర్ తలుచుకుంటే ఆలోచనలు తక్కువా..! గతంలో యూపీఏ హయాంలో పవర్ తన దగ్గర పెట్టుకొని మన్మోహన్ సింగ్‌ని ప్రధానిని చేసిన సోనియా ఫార్ములాని ఇక్కడ అమలు చేసే పనిలో ఉన్నారు కేసీఆర్.. పదవిలో దళిత ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి ఫాంహౌజ్ నుంచే పరోక్షంగా పాలన చేస్తారని టాక్. ఐడియా బాగానే ఉంది కానీ దళిత ముఖ్యమంత్రి అయ్యే ఆ లక్కీ, డమ్మీ నేత ఎవరన్నది మరో పాయింట్.
Also Read :
- Nabha Natesh : పద్ధతిగా రెచ్చిపోయిన నభా..!
- Teenmaar Mallanna : ఫాఫం….. తీన్మార్ మల్లన్న బైటికొచ్చుడు కష్టమేనట..!
- ‘బుల్లెట్టు బండి’ పాపకి బంపర్ ఆఫర్..!
- V6 Teenmaar : తీన్మార్ రాధ ఎందుకు కనిపించడం లేదు..? ఏమైంది..?
- వర్మలోని ‘కామాంధుడు’ మరోసారి నిద్రలేచాడు..!