KCR : తగ్గేదేలే.. మళ్లీ గవర్నర్ ను లెక్క చేయని కేసీఆర్..!
Latest News Telangana

KCR : తగ్గేదేలే.. మళ్లీ గవర్నర్ ను లెక్క చేయని కేసీఆర్..!

KCR : రాష్ట్రంలో సీఎం, గవర్నర్ మధ్య చాలా గ్యాప్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రానురాను ఈ గ్యాప్ మరింతగా పెరుగుతోంది. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కూడాగవర్నర్ తమిళిసైను పిలవలేదు కేసీఆర్(KCR ).. విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులందరికీ ప్రభుత్వం తరుపున ఆహ్వానాలు అందాయి. కానీ గవర్నర్ తమిళిసైకు మాత్రం ఆహ్వానం అందలేదని అధికారుల నుంచి సమాచారం.

ప్రభుత్వం కార్యక్రమమే అయినప్పటికీ గవర్నర్ కు ఆహ్వానం అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి కూడా గవర్నర్ ను కూడా అహ్వానించలేదు ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ వాపోతున్నారు. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలు కూడా హాజరుకావడం లేదు.

తనకు అహ్వానం అందింది కానీ తాను వెళ్లడం లేదని బహిరంగగానే చెప్పారు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు వేర్వేరు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

గతంలో కేసీఆర్ బర్త్ డే (ఫిబ్రవరి 17న) సందర్భంగా సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని, అందుకోసం పలు రాష్ట్రాల సీఎంలకు రాష్ట్రప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. కానీ ఈసారి మాత్రం అలాంటి అతిథులెవరూ లేకుండానే సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది.

Also Read :