KCR : బండి సంజయ్‌‌‌ని బజారున నిలవేట్టిన కేసీఆర్..!
Latest News Telangana

KCR : బండి సంజయ్‌‌‌ని బజారున నిలవేట్టిన కేసీఆర్..!

KCR : తెలంగాణ సీఏం కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు.. మునపటి సీఏంని మళ్ళీ చూపించారు. విపక్షాలను ఓ ఆట ఆడుకున్నారు.. ముఖ్యంగా బీజేపీ పైన, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన కేసీఆర్(KCR) ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని గరంగరం అయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, నా కత్తిలేదు.. అసలు జిమ్మేదారు లేదంటూ తనదైన శైలిలో అర్సుకున్నారు కేసీఆర్. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, టచ్ చేస్తే కదా తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు.

ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే కేసులు పెట్టి నిరూపించుకోవాలని అన్నారు. అసలు బండి సంజయ్ కి ఇంగ్లీష్, హిందీ అర్ధమైతదా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీవోలన్న అర్ధమైతయా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలని నిలదీశారు సీఏం.

ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? అనే స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు విషయంలో ఒకపక్కా కేంద్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుంటే రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి ఇలా అబద్ధాలు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.

బండి సంజయ్ సొల్లు మాటలు వింటే రైతులు ఆగమైపోతారని అన్నారు సీఏం. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలని సూచించారు. తాను కూడా కేంద్రమంత్రిగా పనిచేశానని అన్నారు.

Also Read :