ఆరేళ్ళుగా సహజీవనం.. ప్రియుడు మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..!
Latest Off Beat Telangana

ఆరేళ్ళుగా సహజీవనం.. ప్రియుడు మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..!

ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడితో కలిసి గత మూడు నెలలుగా ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటోంది.

అయితే కిరణ్ మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయం అనురాధకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉండడం, అతడు మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన అనురాధ ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి పోలీసులకి ఫిర్యాదు చేసింది.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.