BJP : మొన్న ఎన్టీఆర్.. రేపు నితిన్.. బీజేపీ ఏం చేస్తుంది?
Latest News Telangana

BJP : మొన్న ఎన్టీఆర్.. రేపు నితిన్.. బీజేపీ ఏం చేస్తుంది?

BJP : తెలంగాణ పై పూర్తిగా ఫోకస్ చేస్తోంది బీజేపీ .. అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది. పేరు మోసిన లీడర్లనే కాదు.. టాలీవుడ్ హీరోలను కూడా వదలడం లేదు. మొన్న మునుగోడు సభ కోసం హైదరాబాద్ కు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఇది రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

క్యాజువల్ మీటింగ్ అని బయటకు కవర్ చేస్తున్నారు  కానీ.. మనిషితో పని లేకపోతే నిమిషం కూడా మోడీ, అమిత్ షా టైమ్ వేస్ట్ చేయరన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ తరుపున క్యాంపెనింగ్ చేయాలని అమిత్ షా .. ఎన్టీఆర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. బీజేపీ(BJP ) హైకమాండ్ ఇంతటితో ఆగడం లేదు.

రేపు(శనివారం) శంషాబాద్‌ నోవాటెల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ కానున్నారు. నితిన్ తో పాటుగా మిథాలీ రాజ్‌ తో కూడా నడ్డా సమావేశమవుతారు. రేపు ఈ లిస్టులోకి ఏ ఏ హీరో రానున్నాడో చూడాలి.

Also Read :