Yasmeen Basha : జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ధర్మపురి లక్ష్మీనరసింహా ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ఆమె ఏఎస్ అధికారి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. హిందు సంప్రాదాయ పద్దతిలో నుదుటన బొట్టు పెట్టుకుని,తలపాగ చుట్టుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. షేక్ యాస్మిన్ బాషా (Yasmeen Basha )ముస్లిం అయినప్పటికీ ఆచారాలు, పద్దతులు పాటించడాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న గుడికి వెళ్లినప్పుడు కూడా ఆమె సీఎం వెంటే ఉన్నారు. అంజన్న బొట్టు కూడా తన కంఠంపై పెట్టుకున్నారు.
