‘దళితబంధు’కి సీఎం కేసీఆర్ భార్యకి ఏంటి సంబంధం..?
Latest News Telangana

‘దళితబంధు’కి సీఎం కేసీఆర్ భార్యకి ఏంటి సంబంధం..?

 

Dalit Bandhu scheme : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని శాలపల్లి ఇందిరానగర్‌‌లో దళితబంధు బహిరంగ సభ నిర్వహించారు సీఎం కేసీఆర్.. ఈ మీటింగ్‌‌లో దళితబంధు స్కీం ని ప్రారంభించిన సీఎం స్కీం గురించి మాట్లాడారు. అందులో భాగంగానే స్కీం పెట్టేముందు తన ఇంట్లో జరిగిన సంబాషణను కేసీఆర్ ప్రస్తావించారు.

తెలంగాణ ఉద్యమానికి వెళ్తున్న సమయంలో ఉద్యమానికి వెళ్ళాలా వద్దా అని తన భార్యని అడగగా, పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించేది ఏమీ లేదు. న్యాయం ఉంది కొట్లాడని చెప్పింది. అలాగే దళితబంధు గురించి అడిగితే దళితుల పరిస్థితి అన్యాయంగా ఉంది. నువ్వు మొండిపడతావు కదా అని అమె ఆశీర్వదించి చేయమని చెప్పిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కరీంనగర్ జిల్లాలోనే రైతుభీమాకి శ్రీకారం చుట్టామని, ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు.

అలాగే దళితబంధు కూడా ఓ మహాఉద్యమంగా సాగాలని అన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకి కూడా దళితబంధు అందజేయనున్నట్లు సీఎం కీలక ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వ రిటైర్డ్, ఉద్యోగులు అందరికంటే చివరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలలో నిరుపేదలకి ముందుగా దళితబంధు ఇస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ పధకాన్ని ఏడాది కిందే మొదలుపెట్టాలని కానీ కరోనా కారణంగా వాయిదా పడిందని అన్నారు.

ఈ పధకం దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మిషిన్ భగీరధ లాగే మిగతా రాష్ట్రాలు కూడా దళితబంధు స్కీం ని అమలు చేస్తాయని అన్నారు. దళితబంధు విజయం సాధించాలంటే అందరు ఒకే పని కాకుండా వేర్వేరు పనులు చేయాలనీ సీఎం సూచించారు.

Also Read :