Indira shoban :పిచ్చోళ్ల పార్టీలో నేను ఉండలేను.. అంతా ఆయనే చేశారు!
Latest Telangana

Indira shoban :పిచ్చోళ్ల పార్టీలో నేను ఉండలేను.. అంతా ఆయనే చేశారు!

Indira shoban serious comments on Sharmilas YSRTP: YSRTPకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ఇందిరాశోభన్ ఆ పార్టీపై సీరియస్ కామెంట్లు చేశారు. నిన్నటి దాకా షర్మిల పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఇందిరా శోభన్.

తెలంగాణలో షర్మి పార్టీకి ఓ బలమైన లీడర్ గా ఉన్నారు. గట్టిగా మాట్లాడే నేత కూడా ఆమెనె. కానీ పరిస్థితులు సడెన్ గా మారిపోయాయి.
పార్టీ వీడిన ఇందిరా శోభన్.. సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీలో పరిస్థితి బాగోలేదని చెప్పారు. షర్మిల చాలామందిని నమ్మి పార్టీలోకి తీసుకున్నారని.. కానీ వారంతా ఆమెను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేనివారు షర్మిల పార్టీలో లీడర్లయ్యారని.. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.
రాజకీయం అంటే ఏంటో తెలియనివాళ్లు.. వాళ్లు ఉంటున్న గల్లీలో కూడా సరిగా పరిచయాలు లేనివాళ్లు YSRTPలో లీడర్లుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. అలాంటి పిచ్చోళ్ల మధ్య పనిచేయడం ఇష్టం లేకే బయటకకు వచ్చానని ఇందిరాశోభన్ చెప్పారు.
రాజగోపాల్ అనే వ్యక్తి షర్మిల పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో గ్రూపులు తయారు చేశారని.. ఆయనను తీసేస్తే ysrtp బాగుపడబోదన్నారు ఇందిరాశోభన్.

ఈ ‘బుల్లెట్టు బండి’ పాప ఎవరో తెలుసా?