KPHB Colony : తనని వదిలి మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదింది ఓ భార్య.. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్గేషన్ (KPHB Colony) పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్‌కు అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో పెళ్లైంది.
ప్రకాష్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. పెళ్లిలో రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి వరకట్నం కింద ముట్టజెప్పారు. అయితే పెళ్ళైన నెలరోజుల నుంచే భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు ప్రకాష్.. ఇంటికి రాకపోవడం, కొత్త కాపురం పెట్టాక భార్యను కారణం లేకుండానే హింసించడం వంటివి చేసేవాడు.
అంతేకాకుండా తనతో అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని వాపోయింది. ఈ బాధలు తట్టుకోలేక ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని వెల్లడిచింది. ఈ క్రమంలో భర్తకి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకొని పక్కా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదింది. అనంతరం పోలీసులకి ఫిర్యాదు చేసింది.
Also Read :
- ఈ ముగ్గురు హీరోల టర్నింగ్ పాయింట్లో ఒకే హీరోయిన్.. !
- TRS కొంపముంచుతున్న కలెక్టర్లు.. సీఏం సాబ్ ఏందీ కథ…!
- Chanda Nagar Case : ప్రియుడే హంతకుడు.. లాడ్జ్‌లో షాకింగ్ విషయాలు..!
- ప్రేమ,పెళ్లి .. గర్భవతిని చేసి మరో అమ్మాయి మేడలో మూడు ముళ్ళు..!
- Cheating Love : ప్రేమ,పెళ్లి అన్నాడు.. గర్భవతిని చేసి పరారయ్యాడు..!