Yadadri : యాదాద్రికి వెళ్లాలంటే చుక్కలే..ధరలు పెంచిన్రు
Latest News Telangana

Yadadri : యాదాద్రికి వెళ్లాలంటే చుక్కలే..ధరలు పెంచిన్రు

Yadadri : యాదాద్రికి వెళ్లే భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే కొండ పై పార్కింగ్ ఫీజులను ఆడ్డగోలుగా వసూలు చేస్తున్న అధికారులు తాజాగా తలనీలాల టికెట్ ధరలను పెంచారు. ఇప్పటివరకు టికెట్ ధ‌ర రూ. 20 ఉండగా దానిని రూ. 50 చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన త‌ల‌నీలాల టికెట్ ధ‌ర‌లు రేప‌ట్నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. పెంచిన ధరల పై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిలువుదోపిడి అంటున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పున:‌ప్రారంభం కావడంంతో ఆలయానికి భక్తుల రద్దీ వీపరితంగా పెరిగింది. శుక్రవారం స్వామివారిని 13,978 మంది భక్తులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు చెపుతున్నారు.

Also Read :