Dmart Offer : పుక్కట్ల వస్తున్నయని పంచి పెడుతున్నడట..! మీ కొంప కొల్లేరే..!
Latest Telangana

Dmart Offer : పుక్కట్ల వస్తున్నయని పంచి పెడుతున్నడట..! మీ కొంప కొల్లేరే..!

Fake link on Dmart Offer : డీమార్ట్ యానివర్సరీ ఆఫర్ పేరుతో వాట్సప్ లో ఓ లింక్ సర్క్యేలేట్ అవుతోంది. లింక్ ఓపెన్ చేస్టే గిఫ్ట్ లు ఇస్తామంటూ అట్రాక్టింగ్ గా టెక్ట్స్ పెట్టి.. లింక్ షేర్ చేస్తున్నారు.

ఇలాంటి లింక్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఒక్క డీమార్ట్ (Dmart Offer)కాదు.. యానివర్సరీ ఆఫర్ పేరుతో చాలా లింక్ లు ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి.

ఈ లింకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఫేక్ వెబ్ సైట్ లింక్ లు.

వీటిని ఓపెన్ చేస్తే మీ మొబైల్ లో ఉన్న డేటా.. అంటే మీ మొబైల్ నంబర్ తో సహా.. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ యాప్ ల పాస్ వర్డ్ లు అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. మనకు తెలియకుండానే మన అకౌంట్లోని డబ్బులన్నీ మాయం అవుతాయి.

హ్యాకర్లు.. మహిళల ఫొటోలు అశ్లీల వెబ్ సైట్లలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వాస్తవానికి ఒరిజినల్ వెబ్ సైట్లు అయితే.. దాని చివరలో .com, .in, .net, .nic.in, .org వంటివి ఉంటాయి.

కానీ ఫేక్ లింక్ ల చివరలో మనం పైన చెప్పుకున్నవి ఉండవు..xyz, .site, .abc…. ఇలా వాళ్లకు ఇష్టమొచ్చిన ఎక్స్ టెన్షన్ తో సైట్లు క్రియేట్ చేస్తారు.

Godaddy లాంటి డొమైన్ సెల్లర్స్ దగ్గర వంద రూపాయలు కడితే.. ఇలాంటి డొమైన్ వచ్చేస్తుంది. వాటితో ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి మన ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

అందుకే.. బంపర్ ఆఫర్లు, ఫ్రీ కూపన్లు, 75 శాతం తగ్గింపు ధరలు అంటూ వచ్చే ఫేక్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి.

ఇవన్నీ కాదు.. కామెడీ కాకపోతే.. డీమార్ట్ కు పోతే.. కిలో పప్పు మీద జెర పదిరూపాయలు తగ్గించమంటేనే.. తగ్గించడు. అలాంటిది ఫ్రీగా ఎందుకు గిఫ్ట్ లు ఇస్తాడు చెప్పండి..?