Eatela rajender in confusion : ఇప్పుడు ఎక్కడ చూసినా హుజురాబాద్ ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. నెల రోజుల్లో పోలింగ్ అయిపోతుంది. ఈటల రాజేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారని.. బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. మోడీ భేటీ అయిన మరుసటి రోజే దోశ తిరగబడింది.
ఇప్పుడప్పుడే హుజురాబాద్ బైపోల్ ఉండబోదని ప్రకటన వచ్చింది. ఏం చేసినా ఇంకో రెండు నెలల దాకా హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలే లేవు.
ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎంత లేట్ అయితే టీఆర్ఎస్ కు అంత బెన్ ఫిట్ అని సర్వేలన్ని చెప్పాయి.
ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అంటే హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. బీజేపీకి(హుజురాబాద్ లో బీజేపీ అంటే కేవలం ఈటల రాజేందర్) నూటికి నూరు శాతం దెబ్బ పడటం ఖాయం.
అంటే.. ఈటల రాజేందర్ కు గునపాలు దిగినట్టే కదా.
..
అయినా ఈటల రాజేందర్ తగ్గట్లేదు. ఆయనకు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు తగ్గట్లేదు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమంటూ, నరికేస్తాం.. చించేస్తాం అంటూ డైలాగులు వదులుతున్నారు.
రాజకీయ నాయకులు కాబట్టి డైలాగులు వదులుతారు అనుకోవచ్చు.
మరి.. ఈటల రాజేందర్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు.. ఢిల్లీ స్థాయిలో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో ఆయనకు ఎందుకు తెలియడం లేదనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ, ప్రభుత్వ పెద్దలను అంటే మోడీ, అమిత్ షా లాంటి వారిని కలిసి వచ్చారు. సడెన్ గా బీజేపీకి కాస్త అనుకూలమైపోయారు. అప్పుడే ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అదయ్యాక కొద్దిరోజులకే ఈటల బీజేపీలోకి వెళ్లారు. టీఆర్ఎస్ తో తమకు దోస్తీ లేదని.. అమిత్ షా హామీ ఇచ్చారని రాష్ట్రానికి వచ్చి చెప్పుకున్నారు.
కానీ.. ఇప్పుడు అదే అమిత్ షాతో, మోడీతో కేసీఆర్ భేటీ అయ్యారు. మోడీతో మాట్లాడిన తెల్లారే హుజురాబాద్ ఎలక్షన్ ఇప్పుడప్పుడే లేదని ప్రకటన వచ్చింది.
అంటే.. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు, టీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ఇదంతా జరిగిందా..?
చిన్న పిల్లాడిని అడిగినా.. దాల్ కుచ్ కాలా హై..
ఈటల రాజేందర్ ను.. వెర్రోన్ని చేసిన్రు హై.. అని చెప్తరు.
కానీ.. ఈటల రాజేందర్ కు మాత్రం ఇంకా ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదనేది ఇప్పుడు.. మనకు అర్థం కాని విషయం. ఆయనక్కొడే కాదు.. ఆయనకు వెనకాలుండి ఎగదోస్తున్న చాలామంది నేతలు.. ఎందుకిలా చేస్తున్నారన్నది కూడా అర్థం కాని విషయమే.
ఇండిపెండెంట్ గా బరిలో దిగినా హుజురాబాద్ లో గెలిచే పతార ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్.
కానీ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుని ఎర్రి నాగన్న అయ్యిండనేది బయట జరుగుతున్న చర్చ.
మరి.. ఈ విషయం ఆయనకు ఎప్పటికి తెలుస్తుందో చూడాలి.
..
ఏదేమైనా..
రంది పడకు రాజేందరన్నా.. నీ ముడ్డి కింద బొంద తోడుతున్నరన్న..
బాధ పడకు రాజేందరన్న.. నిన్ను రాజకీయంగా బొందవెట్టె కుట్ర చేస్తున్నరన్న..
రండి పడకు రాజేందరన్న.. నీకు బైలర్ కోడే దిక్కు చేసేతట్టున్నరన్న…
Read Also :
- Weather forecast : ఇంట్లకెళ్లి బయటకు ఎల్లకున్రి.. మీకే మంచిది..!
- Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
- Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ లోకి బూతుల బ్యూటీ.. ఇక రోజు బీప్ వేసుకోవాల్సిందే..!
- Rashi Singh : తడిసిన బట్టలతో మెరిసిన అందాలు.. !
- Naina Ganguly ని ఇలా చూస్తే ఖతమే..!
- అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?
- Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!