Disha daily : ఓ దిశ.. ఎటు నీ దిశ..?
Latest Telangana

Disha daily : ఓ దిశ.. ఎటు నీ దిశ..?

disha daily article on prashanth kishor tour: ప్రస్తుతమున్న మీడియాకు మేం ప్రత్యామ్నాయం.. మా వార్తల రూటే సెపరేటని చెప్పుకుంటూ తెలుగులో డిజిటల్ రూపంలో పుట్టుకొచ్చింది దిశ అనే ఓ పేపర్. బ్యాలెన్స్ డ్ గా వార్తలు రాస్తామని.. తమది ఏ పక్షమూ కాదని.. ప్రచారం చేసుకుంది. తాము ప్రజల పక్షానే ఉంటాము తప్ప ఏ పార్టీకీ బాకాలూదబోమని చెప్పుకుంది.

కానీ ఈ మాట చెప్పుకుని ఏడాది కూడా గడవక ముందే దోశ తిరగేసినట్టు.. తన ఎజెండాను తిరగేసింది దిశ. అసలు ఆ దిశ పేపర్.. “దిశ” ఎటువైపనేది రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఉన్న బాధ్యులు, పనిచేసే వారు.. ప్రజాఉద్యమాలతో సంబంధమున్నవారు. కాబట్టి నిజంగానే ఆ దిశ.. ప్రజలకు దిశ చూపిస్తుందనుకున్నారు.

కానీ  ఇప్పుడది పూర్తిగా కమలం తోటలో కథాకళి డ్యాన్సులు చేస్తోంది. కాషాయ జెండా పట్టుకుని వాయువేగంతో పరుగులు పెడుతోంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడటం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం తమ అజెండా అని చెప్పిన దిశ.. ఇప్పుడు పూర్తిగా కాషాయ అజెండా పూసుకుందనేది ఆ పేపర్ చూస్తే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.

..

దీనికి ఓ ఎగ్జాంపుల్ ఇది.

దిశ పేపర్లో ఆదివారం (ఏప్రిల్ 24,2022న) ఓ వార్త వేశారు. “అర్థరాత్రి హల్చల్.. నగరంలో పీకే అంటూ..” ఓ వార్తను ఫస్ట్ పేజీలో ప్రచురించింది. అయితే.. మీడియాలో సోర్స్ ఎక్కువగా ఉన్నవారు ఎక్స్ క్లూజీవ్ వార్తలు రాస్తారు. దాన్ని ఎవరూ తప్పుపట్టరు.

కానీ.. పీకే శనివారమే హైదరాబాద్ వచ్చాడని.. ప్రగతిభవన్ లో మకాం పెట్టాడని మిగతా మీడియా అంతా కోడై కోసింది. ప్రగతిభవన్ లో చర్చలు జరుగుతున్నాయని రాత్రి కూడా అక్కడే బస చేస్తారని.. రెండు మూడు రోజులుంటారని నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.

కానీ కాషాయదిశలో పయనిస్తున్న దిశ మాత్రం వార్తను కొత్తగా ఇస్తున్నామనే ఉత్సహంలో అసలు కేసీఆర్ తో భేటీ అనే వార్తనే పూర్తిగా మరిచిపోయింది.

కాంగ్రెస్ బలోపేతంలో భాగంగానే పీకే హైదరాబాద్ వచ్చారని.. అర్థరాత్రి వరకు మంతనాలు జరిగాయని రాసుకొచ్చింది. మరో అడుగు ముందుకేసి.. కేసీఆర్ కు వ్యతిరేకంగా పీకే పనిచేస్తున్నారని వార్తను వడ్డించింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ను ఏకం చేసే పనిలో భాగంగానే పీకే వచ్చారంటోంది దిశ.

ఓవరాల్ గా దిశ పేపర్ రాసిన వార్త చూస్తే.. జనంలో ఇటు కాంగ్రెస్ ను , అటు టీఆర్ఎస్ ను బ్లేమ్ చేయడం తప్ప మరొకటి లేదు.

..

ఇదొక్కటే కాదు.. ఇటీవలి కాలంలో ప్రతీ రోజు ఈ పత్రిక ఫ్రంట్ పేజీలో ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి.

మరి.. ఇప్పుడున్న మీడియా అంతా చెడిపోయింది. తాము మాత్రమే సొక్క పూసలమని చెప్పుకున్న మాటలన్ని ఏమైనట్టు..? జనం కోసమే పనిచేస్తామని రాసిన రాతలు ఏ మూసీల కలిసినట్టు.?

ప్లీజ్.. మీరు పనిచేస్తే మాది పలానా పార్టీ అని ధైర్యంగా చెప్పుకోండి. అంతేగానీ.. మేం ప్రజలకోసమే పనిచేస్తున్నామని చెప్పి.. ఓ పార్టీ జెండా ఎత్తుకుని జనాలను తప్పుదారి పట్టించకండి.

Read Also :