Dildar News : దిల్దార్ జోరు.. ధూంధాం, గరం గరం, పటాసుల ఢీలా..!
Latest Telangana

Dildar News : దిల్దార్ జోరు.. ధూంధాం, గరం గరం, పటాసుల ఢీలా..!

Dildar News Showing Better performance Comparing to other channels : తెలుగు న్యూస్ ఛానళ్లలో తెలంగాణ యాసలో ఓ బులిటిన్ కామన్ అయిపోయింది. ఆంధ్రా ఛానళ్లుగా పేరున్నా.. తెలంగాణ యాసలో సెటైరికల్ వార్తలు ఇస్తున్నాయి. ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

తెలంగాణ యాసలో వార్తలు చెప్పడం మొదట వీ6 మొదలుపెట్టింది. తీన్మార్ వార్తల పేరుతో తెలుగు మీడియా చరిత్రలో దాదాపు పదేళ్ల కింద ఓ కొత్త ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత చాలా ఛానళ్లు దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాయి. ఒకదాని తర్వాత ఒకటి.. అన్ని ఛానళ్లు తెలంగాణ భాషకు సమయం కేటాయిస్తూ వస్తున్నాయి.

Read Also :

ఈ విషయంలో ఛానళ్ల మధ్య చాలా పోటీ ఉందనే చెప్పాలి. టాప్ ప్లేసులో ఉన్న ఛానళ్లు.. ఇతర ఛానళ్లలో కాస్త ఫేమ్ ఉన్న యాంకర్లను తీసుకెళ్లి ఎపిసోడ్స్ చేస్తున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. యాంకర్లకు స్క్రిప్ట్ రైటర్లకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు.

ఛానళ్లు ఎంత చేసినా రేటింగ్ కోసమే. కానీ ఇంత ఖర్చు పెట్టినా.. రేటింగ్ దగ్గరకొచ్చే సరికి బడా ఛానళ్లు, భారీ బడ్జెట్ ఛానళ్లకు  దిమ్మదిరుగుతోంది. వీ6 ఎలాగూ తనస్థానాన్ని పదిలం చేసుకుంది. ఎవరూ దాన్ని కొట్టే పరిస్థితి లేదు. కానీ కొద్ది రోజులుగా మిగతా ఛానళ్ల రేటింగ్స్ ను పరిశీలిస్తే ఖర్చు భారం ఫలితం శూన్యం అన్నట్టుగానే ఉంది.

తెలంగాణ ఛానల్ గా పేరున్న టీన్యూస్ ధూం ధాం ముచ్చట 0.25 జీఆర్పీలు, సాక్షి టీవీ గరమ్ గరమ్ వార్తలు 0.13 జీఆర్పీ, హెచ్ టీవీ జోర్దార్ వార్తలు 0.10 జీఆర్పీ, టీవీ5 మాస్ మల్లన్న 0.31 జీఆర్పీ, 10 టీవీ పటాస్ న్యూస్ 0.17 జీఆర్పీ సాధించింది. విచిత్రం ఏంటంటే.. పక్కా ఆంధ్రా ఛానల్ గా పేరున్న టీవీలో వచ్చే మాస్ మల్లన్న ప్రోగ్రామ్ ని.. పక్కా తెలంగాణ ఛానల్ టీ న్యూస్ బీట్ చేయలేకపోవడం.

10tv
పటాస్ వార్తలు
hmtv
జోర్దార్ వార్తలు
sakshi
గరం గరం వార్తలు
t news
ధూం ధాం ముచ్చట
tv5
మాస్ మల్లన్న

వీటన్నింటి కంటే కూడా.. న్యూస్ ఛానలే కానీ వనిత టీవీ దూసుకెళ్తోంది. తెలుగులో మహిళల కోసమే పెట్టిన ఛానల్ వనిత టీవీ. టాప్ 1 ఛానల్ ఎన్టీవీ గ్రూప్ కు చెందిన సంస్థే అయినా.. ఎక్కడా పెద్దగా హడావుడి ఉండదు. అయినా రేటింగుల్లో దూసుకుపోతోంది. తెలంగాణ యాసలో ప్రసారమయ్యే దిల్దార్ వార్తలు మిగతా ఛానళ్లను పరేషాన్ చేస్తున్నాయి. దిల్దార్ వార్తలు వారం రోజుల్లో అత్యధికంగా 0.45 జీఆర్పీలు సొంతం చేసుకుంది. పదిరోజుల్లో ఏ ఛానల్ కు రాని టాప్ జీఆర్పీ వనిత టీవీ దిల్దార్ న్యూస్ వచ్చింది.

vanitha tv
దిల్దార్ వార్తలు

చాలా ఛానల్స్ పొలిటికల్ సెటైర్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పొలిటికల్ సెటైర్ కోసం చాలా మంది వీ6 చూస్తారు. దిల్దార్ వార్తల్లో పొలిటికల్ తో పాటు ఆఫ్ బీట్ కంటెంట్ కూడా ఉండటంతో వ్యూయర్ షిప్ పెరిగి ఉండొచ్చు.

భారీ బడ్జెట్ తో, యాంకర్లకు భారీగా జీతాలిస్తూ నడిపిస్తున్న  గరమ్ గరమ్ వార్తలు, ధూం ధాం ముచ్చట, జోర్దార్ వార్తలు వెనబడుతుండటంతో మేనేజ్ మెంట్లు కూడా ఆలోచనలో పడినట్టుగా టాక్ వినిపిస్తోంది.