Danyon it technology : వీడు మామూలోడు కాదు.. ఒక్క యాడ్ తో కొట్లు దొబ్బేశాడు..!
Latest Telangana

Danyon it technology : వీడు మామూలోడు కాదు.. ఒక్క యాడ్ తో కొట్లు దొబ్బేశాడు..!

Danyon it technology cheated unemployed: సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలు.. ఎంతైనా సరే డబ్బులు పెడుతున్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దీంతో మరో కంపెనీ డబ్బులు నొక్కేసి బోర్డు తిప్పిసింది.

దన్యన్ ఐటీ టెక్నాలజీ కంపెనీ Danyon it technology ఉద్యోగాల పేరు చెప్పి.. డబ్బులు తీసుకుని ఇప్పుడు బిచాణా ఎత్తేసింది. వందమందికి పైగా యువకుల నుంచి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్ బుక్ లో ప్రకటన చూసి డబ్బులు ఇచ్చామని బాధితులు అంటున్నారు. ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకుని.. ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి 4 లక్షల ప్యాకేజీ అని కూడా చెప్పారని అంటున్నారు.

మాదాపూర్ లో మంచి హై ఫై గా ఉన్న బిల్డింగ్ లో ఆఫీసు Danyon it technology పెట్టడంతో అది చూసి నమ్మామని బాధితులు చెబుతున్నారు. కంపెనీ షోకులే తప్పా.. అంతా దోపిడీ నడుస్తోందని ఆరోపించారు.

తర్వాత ప్రాజెక్ట్ ఇస్తామంటూ తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. తర్వాత ప్రాజెక్టు రాలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ ప్రతినిధి ప్రతాప్ కట్టమూరి ప్రతాప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also :