Huzurabad By poll : సర్వేల లెక్కలే నిజమయ్యాయి.. హుజురాబాద్ బై పోల్‌లో(Huzurabad By poll ) అభివృద్ధి కంటే ఆత్మగౌరవమే నిలబడింది.. ఊహించిన దానికంటే భారీ మెజారిటీతో గెలిచి తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు ఈటెల రాజేందర్.. ఈ ఉపఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. పైలెట్ ప్రాజెక్ట్ గా దళితబంధు అనే స్కీమ్‌ను ఈ ఉపఎన్నికతో తెరపైకి తీసుకొచ్చారు సీఎం కేసీఆర్..ఒక్కో ఇంటికి పది లక్షలు అంటూ స్కీమ్ ని లాంచ్ చేశారు.
అయితే ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ని కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.. మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన తెలంగాణని కేసీఆర్ ఆల్రెడీ అప్పులపాలు చేశారన్న అపవాదు ఉంది. అటు కరోనాతో రాష్ట్రం మరింత అప్పులపాలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్కగా ఇచ్చుకోలేని స్థితిలో ఉంది రాష్ట్రం. మొన్నటివరకు ఆర్టీసీ ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
అలాంటి టైంలో దళితబంధు అంటూ పదిలక్షలు ఇచ్చుడు ఏందీ? అని చాలా మంది ప్రజలు ఆలోచనలో పడ్డాడని వారి అభిప్రాయం. ఇలా ఆలోచన చేసిన వారిలో దళితులు కూడా ఉన్నారు. కొందరు దళితులు .. దళితబంధు డబ్బులను వెనక్కి ఇచ్చిర్రు కూడా.. కేసీఆర్ హుజురాబాద్‌ను ఓ ఉపఎన్నిక లాగా చూడకుండా దానిని ఓ పర్సనల్ ఇష్ష్యూ లాగా తీసుకున్నారని.. బలమైన ఈటెలను ఓడించేందుకే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారని.. అదే హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమికి కారణమైందని రాజకీయ విశ్లేషకుల మాట.
మరి ఇప్పుడు హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో దళితబంధు స్కీమ్‌ను కంటిన్యూ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ నెలకొంది,
Also Read :
- Puneeth Rajkumar : నీ జీవితం నిజంగా ‘పునీత’మే.. అభిమానుల గుండెల్లో ఎప్పటికి ‘రాజకుమారుడ’వే..!
- Petrol And Diesel : పెట్రో మంటలు.. తగ్గేదే..లే.. ! త్వరలో వంట గ్యాస్ మరో వంద..!
- KPHB Colony : మరో మహిళతో శృంగార లీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ..!