Karimnagar collector : వీళ్లు ఊరికే ఉండరు కదా.. మల్లోకరు దొరికిపోయారు..!
Latest Telangana

Karimnagar collector : వీళ్లు ఊరికే ఉండరు కదా.. మల్లోకరు దొరికిపోయారు..!

Controversy over karimnagar collector flexi : ఐఏఎస్ అంటే చాలా పవర్ ఫుల్ ఉద్యోగం. ఓ జిల్లాకు కలెక్టర్ గా.. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక అధికారులుగా ఉండేది ఐఏఎస్ లే. అందుకే ఐపీఎస్ కంటే కూడా ఐఏఎస్ కే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ప్రభుత్వాలను శాషించే స్థాయిలో ఐఏఎస్ లు ఉండాలి.

కానీ ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం మరొకటి. చాలామంది ఐఏఎస్ లు ప్రభుత్వాలకు దాసోహమంటున్నారు. వారు ఏది చెబితే అది చేస్తున్నారు.

ఇంకొందరైతే మరీ అతిభక్తితో ముఖ్యమంత్రులకు పాదాభివందనం చేస్తున్నారు. మొన్నీమధ్యే సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్లు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ఎంత వివాదాస్పదం అయ్యిందో చూశాం. చివరకు వారుస్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇంత జరిగినా కూడా కలెక్టర్లు తమ స్వామిభక్తిని మాత్రం నిరూపించుకుంటూనే ఉన్నారు. భక్తిలో తాము ఏమాత్రం తక్కువ కాదంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిన్న హుజురాబాద్ లో దళితబంధు పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమానికి భారీగా స్వాగత ఏర్పాట్లు జరిగాయి.

ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్(Karimnagar collector) కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పూర్తిగా గులాబీ రంగు, మధ్యలో ముఖ్యమంత్రి ఫొటో ఫ్లెక్సీ తయారు చేయించారు. దాని కింద… దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి గారికి స్వాగతం అంటూ రాయించుకున్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్.

టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ పై కలెక్టర్ పేరు ఏంటనేది ఇప్పుడు నడుస్తున్న రచ్చ.

అయితే.. కర్ణన్ మాత్రం స్వామిభక్తి చూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే.. ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయనను మొన్నీమధ్యే కరీంనగర్ కలెక్టర్ గా తీసుకొచ్చారు. ఆయనతో పాటు.. ఆయన భార్యకు కూడా ట్రాన్స్ ఫర్ చేసి జడ్పీ సీఈవో గా నియమించారు. కాబట్టి.. ఈ మాత్రం భక్తి చూపించుకోవడంలో తప్పులేదనేది మరో వర్గం మాట.

ఏది ఏమైనా రాజకీయ నాయకులను శాసించాల్సిన ఐఏఎస్ లు ఇలా తమ మనుగడ కోసం వారికి దాసోహమనడం మాత్రం కాస్త డిసప్పాయింట్ కలిగించే విషయమే.

Read Also :