Huzurabad Bypoll : చాణక్య నీతా.. రేవంత్ దొంగాటా..?
Latest Telangana

Huzurabad Bypoll : చాణక్య నీతా.. రేవంత్ దొంగాటా..?

Congress And Bjp Friendship In Huzurabad Bypoll : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొద్ది రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పార్టీని రాష్ట్రంలో నిలబెట్టాలి. కేడర్ ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అధికార పార్టీకి ధీటుగా నిలబెట్టాలి.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం కంప్లీట్ గా రూటు మార్చారు. పార్టీని నిలబెట్టాల్సిన వ్యక్తే.. స్వహస్తాలతో పార్టీని నిండా ముంచే ప్రయత్నంచేశారు. హుజురాబాద్ బై ఎలక్షన్ సాక్షిగా అది స్పష్టమైంది.

హుజురాబాద్(Huzurabad Bypoll) లో ఈటల రాజేందర్ కు పై ప్రజలకు అభిమానం ఉంది. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులిచ్చినా ఈటల రాజేందర్ కే ఓటేస్తామని ప్రజలు ముందు నుంచి చెబుతున్నారు.

కానీ ఏ పార్టీకైనా తమకంటూ కొంత కేడర్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంకు ఖచ్చితంగా తమదేననే ధీమా ఉంటుంది. హుజురాబాద్ లో మొదటి నుంచి టీఆర్ఎస్ అదే ధీమాతో ఉంది. దీనికి తోడు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా కొంత వరకు తమకు అనుకూలంగా మారుతుందని భావించారు.

Eatala revanth reddy

ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పుకోవడంతో..బీజేపీ అంటే నచ్చని కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఖచ్చితంగా టీఆర్ఎస్ కే వస్తుందని ఆశపడ్డారు.

కానీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు(Huzurabad Bypoll) టీఆర్ఎస్ కు రాకుండా అడ్డుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తరుపున ఓ అభ్యర్థిని నామ్ కే వాస్తే పెట్టి.. కాంగ్రెస్ ఓట్లన్ని బీజేపీకి డైవర్ట్ చేశారు. బీజేపీకే ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ కేడర్ కు రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయనే ప్రచారం కూడా ఉంది.

ఈటల తన పదవికి రాజీనామా చేయక ముందు నుంచే రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారనే ప్రచారముంది. ఎన్నికల్లోనూ సహకరిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది.

వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. కానీ.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దోస్త్ మేరా దోస్త్.. అంటూ కలిసిపోయాయి. సిద్ధాంతాలు గట్రా పక్కనపెట్టేసి.. మిత్రధర్మం పాటించాయి. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు అవి బీజేపీకి డైవర్ట్ అయ్యాయి.

ఉదాహరణకు.. 14వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1800 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే అవన్నీ ఎటు పోయాయో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో 68 వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఇప్పుడు 2 వేల ఓట్లకే పరిమితం కావడానికి కారణం ఏంటో కూడా బహిరంగ రహస్యమే.

Read Also :