Confusion On BJP Candidate : ఇదేందయ్యా ఇది.. మళ్లీ ఇదేం కన్ఫ్యూజన్..!
Latest Telangana

Confusion On BJP Candidate : ఇదేందయ్యా ఇది.. మళ్లీ ఇదేం కన్ఫ్యూజన్..!

Confusion On BJP Candidate : హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్(trs) నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ(bjp) నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్(balmuri venkat) ఎన్నికలో బరిలో ఉంటారని ఆయా పార్టీలు ప్రకటించాయి.

కానీ బీజేపీ అభ్యర్థి విషయంలోనే మొదటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ పోటీ చేయబోరని.. అతని సతీమణి జమున(eatela jamuna) పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.

దీనికి బలం చేకూర్చేలా ఆమె హుజురాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్నారు.

ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఉన్నా లేకున్నా.. జమున మాత్రం హుజురాబాద్ లోనే పర్యటిస్తున్నారు. తుల ఉమ, బొడిగ శోభ(bodiga shoba) లాంటి నేతలను వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు.

కానీ ఇటీవల అధికారికంగా బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈటల రాజేందరే పోటీలో ఉంటారని చెప్పింది. కానీ సడెన్ గా ఇవాళ ఈటల జమున నామినేషన్ వేశారు.

అయితే బీజేపీ అఫీషియల్ అభ్యర్థి ఈటల రాజేందర్(eatela rajender) కాబట్టి.. ఈటల జమున ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలి. కానీ బీజేపీ అభ్యర్థిగా ఆమె తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అఫిడవిట్ లో క్లియర్ గా తాను బీజేపీ అభ్యర్థినని రాశారు.

దీంతో ఇప్పుడు మరోసారి ఈటల పోటీపై కన్ఫ్యూజన్ మొదలైంది. చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థిగా జమున పేరు ప్రకటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం నడుస్తోంది.

కానీ.. ఈటల జమున నామినేషన్ కు అసలు కారణం వేరే ఉందని సమాచారం. ప్రతీ ఎన్నికలోనూ ఈటల కంటే ముందు సెంటిమెంట్ ప్రకారం జమున నామినేషన్ వేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జమున నామినేషన్ వేశారని చెబుతున్నారు.

eatel jamuna affidavit 2021

ఒక పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులైనా నామినేషన్ వేయొచ్చు. కానీ ఆ పార్టీ బీ ఫారం ఇచ్చిన వ్యక్తే అఫీషియల్ క్యాండిడేట్ గా ఉంటారు. నామినేషన్ల ఉపసంహరణ లోపు మిగతా అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారు. ఒరిజినల్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు రిజెక్ట్ అయితే.. ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇలా డమ్మీక్యాండిడేట్లతో నామినేషన్లు వేయిస్తారు.

కొన్నిసార్లు అసంతృప్త నేతలు కూడా తాము పలానా పార్టీ అభ్యర్థులమంటూ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. కానీ.. చాలా సందర్భాల్లో విత్ డ్రా టైంలోపు వారు సైలెంట్ అయిపోతారు.

ఇదంతా సాధారణమే అయినా.. ఇప్పుడు ఈటల(eatela) ఇష్యూలో మాత్రం.. అనేక అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ ఒరిజినల్ అభ్యర్థి ఎవరనే దానిపై చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.

Read Also :