KCR: ‘ఒళ్ళు దగ్గర పెట్టుకో’… ఆ ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఏం కేసీఆర్..!
Latest News Telangana

KCR: ‘ఒళ్ళు దగ్గర పెట్టుకో’… ఆ ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఏం కేసీఆర్..!

KCR : మహబూబాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ లీడర్ శంకర్ నాయక్ కి సీఏం కేసీఆర్(KCR) వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన్ని చాంబర్‌‌‌కి పిలిపించుకొని సీఏం క్లాస్ పీకినట్టుగా సమాచారం. ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో శంకర్ నాయక్ రచ్చ చేశారు. హోలీ వేడుకల్లో కార్యకర్తలకి బహిరంగంగా మందు పోయడం పెద్ద చర్చకి దారి తీసింది.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి. ఇది సీఏం దృష్టికి వెళ్ళడంతో శంకర్ నాయక్ పైన కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. “హోలీ నువ్వు ఒక్కడివే చేసుకుంటున్నావా.. దేశం మొత్తం చేసుకుంటున్నారా? పార్టీ పరువు తీస్తే బయటకు విసిరేస్తా” అని సీఏం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

గతంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చినప్పటికీ క్షమించానని, మళ్ళీ రిపీట్ అయితే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది.

Also Read :