Cm kcr plan over kaushik reddy MLC Issue : కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీలో ఆయనతో సన్నిహితంగా ఉండే వ్యక్తులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయని చెబుతుంటారు.
ఏ క్షణంలో ఏ మాట చెబుతారోనని తెలియక టెన్షన్ పడుతుంటారట నేతలు.
ఇప్పుడు అలాంటిదే మరో పనిచేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలో.. కాంగ్రెస్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. మొదట ఆయనకే హుజురాబాద్ టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఆయన కూడా తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఫోన్లలో చెప్పుకున్న ఆడియోలు బయటకొచ్చాయి.
కానీ అనూహ్యంగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. దీనిపై స్టేట్ క్యాబినెట్ లో తీర్మానం చేసి గవర్నర్ కూడా పంపారు. గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపారని అప్పట్లో వార్తలొచ్చాయి.
కానీ.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు ప్రకటన వచ్చినా.. దానికి గవర్నర్ ఆమోదముద్ర పడలేదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
కౌశిక్ రెడ్డి మీద గతంలో కొన్ని కేసులున్నాయి. కేసుల విషయం ఎటూ తేలకుండా మండలికి పంపడం అంత మంచిది కాదని అధికారులు సీఎంకు చెప్పారట.
ఇదే సమయంలో… నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయడంపై.. చాలాకాలంగా పార్టీలో ఉన్నవారు అభ్యంతరం చెబుతున్నారట. మరీ ముఖ్యంగా హుజురాబాద్ లో టీఆర్ఎస్ కేడర్ చాలా గరం మీద ఉన్నదట.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు.. కౌశిక్ రెడ్డి మీదున్న కేసులు బ్రహ్మాస్త్రంలా దొరికాయని.. కేసుల సాకు చూపి.. ఎమ్మెల్సీ పదవి కొద్ది రోజులు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
ఈ లోగా కౌశిక్ రెడ్డి మీద ఉన్న కేసులపై ఓ రిపోర్ట్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారట సీఎం. ఆలోగా అన్నీ సర్దుకుంటే కౌశిక్ మండలికి వెళ్తారట. లేకపోతే ఇక అంతే సంగతులు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు.
Read Also:
- Ashu Reddy: అందాల సుందరి.. అషురెడ్డి..
- Raghuveera reddy: ముద్దుల మనవరాలితో మాజీ మంత్రి
- Ashu Reddy bold :ఏందిరయ్యా… కెమెరా యాడ పెట్టుండావ్..?
- Gang Rape : ఆ గ్యాంగ్ రేప్ అంత నాటకం.. ఏం కట్టుకథ అల్లిందిరా బాబు..!
- పడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్.. దిగజారిపోయిన మోదీ పాపులారిటీ..!
- Sravanthi : పాపం.. హాట్ బ్యూటీ స్రవంతికి ఏమైంది..?
- Rao Ramesh : వామ్మో.. రావు రమేష్ రెమ్యునరేషన్ తో ఓ సినిమా తీయోచ్చా ..?