KCR : షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు.. సిట్టింగ్ లకే టికెట్లు
Latest News Telangana

KCR : షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు.. సిట్టింగ్ లకే టికెట్లు

KCR : బీజేపీతో ఇక యద్ధమేనన్నారు సీఎం కేసీఆర్(KCR ). రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్లు ఉండయన్న సీఎం.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని స్పష్టం చేశారు.ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు .

May be an image of 1 person and standing

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్​లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ ఈ విషయాలను వెల్లడించారు.

May be an image of 2 people, child, people standing and indoor

ఈ మీటింగ్ లో కేసీఆర్ కీలకమైన కామెంట్స్ చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీలో చేరాలని ఆ పార్టీ ఒత్తిడి చేసిందని కేసీఆర్ నేతలకు వివరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ఆలోచన తనకు లేదన్న సీఎం… సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తానని చెప్పారు.

May be an image of 2 people and people standing

సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, మళ్లీ అధికారం టీఆర్ఎస్ దేనన్నారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని ఏమైనా సమస్యలుంటే పార్టీ దృష్టికి తీసుకురావలన్నారు.

Also Read :