KCR : కడియం,రాజయ్య లకు క్లాస్ పీకిన కేసీఆర్
Latest News Telangana

KCR : కడియం,రాజయ్య లకు క్లాస్ పీకిన కేసీఆర్

KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో సొంత పార్టీకి చెందిన కొంతమంది లీడర్లకు సీఎం కేసీఆర్(KCR ) వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫైరయ్యారు.

డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని,ఇంకోసారి ఇలా చేస్తే పార్టీ నుంచి సస్పె్ండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అనుచరులు డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలదే బాధ్యతని సీఎం హెచ్చరించారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లకు సీఎం కేసీఆర్ క్లాస్ పీకారు. వ్యక్తగత పోకడలకు పోవద్దని, పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.

ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలి కానీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు. అక్టోబర్ తర్వాత ఎన్నికలు ఉంటాయన్న సీఎం.. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. గెలవడం పెద్ద విషయం కాదన్న కేసీఆర్.. 100 సీట్లే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

ముందుస్తు ఎన్నికలు జరగవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని లేదంటే వారికే ప్రమాదమని హెచ్చరించారు.

Also Read :