Case Filed On Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై భారీగా కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
ఇటీవల రెండు రోజుల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల దగ్గరకు వెళ్లారు సంజయ్. కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రాళ్లదాడులు జరిగాయి. బీజేపీ నేతలు భారీ ర్యాలీ కూడా తీశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో సూర్యాపేట తహశీల్దార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ ర్యాలీ తీయడం, దాడులపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో తహశీల్దార్ ఫిర్యాదు ఆధారంగా బండి సంజయ్ పై మొత్తం 7 కేసులు నమోదు చేశారు.
ఐపీసీ 171 ఏ, 143, 147, 148,188, 504 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు ఫైలయ్యాయి.
Read Also :
- SHABEENA SHAIK : జబర్దస్త్ లో ఈ ఎర్రతోలు పిల్ల ఎవరు?
- IAS Venkatramireddy : కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. రఘన్నకు స్పాట్ పెట్టిండు..!
- Eyy Bidda Idhi Naa Adda : పుష్ప నుంచి మరో సర్ ప్రైజ్.. రచ్చే రచ్చ..!
- YS Jagan : గులాబ్ తుఫాన్ బాధిత రైతులకు పరిహారం
- Bandi Sanjay : ప్లీజ్.. నవ్వొద్దు. సీరియస్ పోస్ట్ ఇది..!
- Akhanda : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!
- Anchor Indu : అందాలు ఆరబోస్తున్న యాంకర్ ఇందు
- RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
- Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
- Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?