Telangana : తెలంగాణలోని(Telangana ) రెండు శాసనసభ స్థానాలకి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. మునుగోడు, వేములవాడ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతాయని ఇందులో తమదే విజయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ నాయకత్వం పైన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, రాష్ట్రంలో బీజేపీకి ఫేమ్ పెరుగుతుందని ఏడాది కిందే కామెంట్స్ చేశారు రాజగోపాల్‌రెడ్డి.
దీనితో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన బీజేపీలో చేరలేదు.. అలా అని కాంగ్రెస్ ముఖ్యమైన కార్యక్రమాలకి హాజరు కావడం లేదు. కచ్చితంగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బీజేపీ నేతలు అంటున్నారు.
దీనిపైన మరో మూడు నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఆయన బీజేపీ నుంచి ఉపఎన్నికలో పోటీ చేసి గెలిస్తారని అంటున్నారు. ఇక వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
దీనిపైన ఒకవేళ కోర్టు తీర్పు ఆయనకీ వ్యతిరేకంగా వస్తే చెన్నమనేని రమేశ్ శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. దీనితో మళ్ళీ ఉపఎన్నిక అక్కడ జరగాల్సి ఉంటుంది. దీనితో అక్కడ బలమైన నాయకుడి కోసం బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే వేములవాడ ఉపఎన్నిక పైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read :
- Harish Rao: హరీష్‌ని బయటకు పంపుడేనా..లేకా సంప్రదాయం మారుస్తారా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి?
- Allu Arjun : అల్లు అర్జున్.. నీకు గాయింత సోయి లేకపోతే ఎట్లా ?
- పియానో వాయిస్తూ 12 మంది మహిళలను బుట్టలో.. నల్గొండలో నికృష్ణుడు
- KCR : బండి సంజయ్‌ని బజారున నిలవేట్టిన కేసీఆర్..!
- Jai Bhim : ‘జై భీమ్’లో సినతల్లిగా నటించిన ఆ పిల్ల ఎవరు… ?